Lalithaa Jewellery Mart IPO: నేడు లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ షేర్లు కేటాయింపు.. గ్రే మార్కెట్‎లో భారీగా ప

లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓకు భారీ డిమాండ్ వచ్చింది. ఆఫర్‌లో ఉన్న 6,27,61,403 షేర్లకు గాను, ఇన్వెస్టర్లు 3,95,20,82,776 ఈక్విటీ షేర్ల కోసం బిడ్లు వేయడంతో, ఈ ఐపీఓ 62.97 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) 145.38 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ కాగా.. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NIIs) వాటా 73.89 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 11.81 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. ఈ ఐపీఓ ఆగస్టు 17న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై, ఆగస్టు 19న ముగిసింది. లలితా జ్యువెలరీ మార్ట్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 190 నుంచి రూ. 201 మధ్య ధరల శ్రేణిని, 74 షేర్ల లాట్ సైజ్‌తో నిర్ణయించింది. ఈ షేర్లు ఆగస్టు 24న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. ఈ రోజు గ్రే మార్కట్ ప్రీమియం రూ.60 గా ఉంది. లలితా జ్యువెలరీ మార్ట్ IPO GMP పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని మార్కెట్ పరిశీలకులు పేర్కొన్నారు. ఒకటి బలమైన సబ్‌స్క్రిప్షన్, రెండోది సెకండరీ మార్కెట్‌లో ట్రెండ్ మారబోతోందనే సంకేతాలు. ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఈక్విరస్ ఈ ఇష్యూకు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, ఎంయూఎఫ్‌జిని రిజిస్ట్రార్‌గా నియమించారు. కంపెనీ బలమైన FY26 ఆర్థిక పనితీరు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్, విస్తరణ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని, లలితా జ్యువెలరీ మార్ట్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Lalitha jewellary

లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 508.20 కోట్లు సమీకరించింది. 22 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ. 201 చొప్పున 2,52,83,581 ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఈ యాంకర్ ఇన్వెస్టర్లలో గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంక్ యూరోప్ ఎస్ఈ - ఓడిఐ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఇంక్., మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఇండియన్ ఈక్విటీ ఫండ్, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, గ్రేటర్ ఇండియా పోర్ట్‌ఫోలియో, సంషి ఫండ్-I సహా పలు ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ ఐపీఓలో ఉద్యోగులకు కేటాయించిన భాగాన్ని మినహాయించి, 50 శాతం అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs) కేటాయించింది. రిటైల్ పెట్టుబడిదారులకు 35% కేటాయించగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15% కేటాయించారు.

ఈ ఇష్యూలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి దీని విలువ. ధరల శ్రేణి గరిష్ట స్థాయి వద్ద, డైల్యూటెడ్ FY26 EPS ఆధారంగా లలితా జ్యువెలరీ మార్ట్ ధర-ఆదాయ నిష్పత్తి (P/E ratio) 9.95 రెట్లుగా ఉంది. కనిష్ట స్థాయి వద్ద, ఈ P/E నిష్పత్తి 9.41 రెట్లుగా ఉంటుంది. FY26 కోసం పరిశ్రమలోని ఇతర సంస్థల సగటు P/E నిష్పత్తి 29.69 రెట్లుగా ఉండటంతో పోలిస్తే ఇది చాలా ఆకర్షణీయంగా ఉండడంటోత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. లలితా జ్యువెలరీ తన IPO ద్వారా సమకూరే నికర నిధులను ప్రధానంగా భారీ రిటైల్ విస్తరణ కోసం, అంటే 10 కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడానికి వినియోగించాలని యోచిస్తోంది. వినియోగించబోయే మొత్తం రూ. 1,033.23 కోట్లలో, రూ. 34.55 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయిస్తారు. ఈ రోజు షేర్ల కేటాయింపు జరగనుంది.

కేటాయింపు ఎలా చెక్ చేసుకోవాలంటే..
in.mpms.mufg.com/Initial_Offer/public-issues.html క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. కంపెనీ ఎంపికలో లలితా జ్యూవెలరీ మార్ట్ లిమిటెడ్ ను ఎంచుకోవాలి. తర్వాత మీ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. సడ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ లలితా జ్యూవెలరీ మార్ట్ లిమిటెడ్IPO అలాట్‌మెంట్ స్థితి మీ కంప్యూటర్ మానిటర్ లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q