GMP: గ్రే మార్కెట్ ప్రీమియం ప్రచురించవద్దన్న సెబీ.. ఎందుకంటే..!

రాబోయే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO) కోసం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) గణాంకాలను ప్రచురించడాన్ని నిలిపివేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సోమవారం నాడు నమోదిత మధ్యవర్తులు, మార్కెట్ భాగస్వాములందరికీ సూచించింది. వెబ్‌సైట్లు, ఇమెయిల్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియాతో సహా అన్ని పద్ధతులు, ప్లాట్‌ఫారమ్‌లలో గ్రే మార్కెట్ ప్రచురణ, ప్రదర్శన, ప్రసారం లేదా వ్యాప్తిని నిలిపివేయాలని నియంత్రణ సంస్థ మార్కెట్ భాగస్వాములను కోరింది. జీఎంపీ సంబంధిత లావాదేవీలలో పాల్గొనవద్దని, గ్రే మార్కెట్ లిస్టింగ్ ధర లేదా ఆశించిన రాబడులకు సూచికగా పరిగణించవద్దని నియంత్రణ సంస్థ పెట్టుబడిదారులను కోరింది.

ఇందుకు సంబంధించి సెబీ ఒక ప్రకటన చేసింది. "గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అధికారికంగా లిస్ట్ కావడానికి ముందు షేర్లు వర్తకం చేయబడతాయని భావించే ఇటువంటి ప్రీ-లిస్టింగ్ ప్రీమియం గణాంకాలు అనధికారికమైనవి, ధృవీకరించబడనివి, నియంత్రణ లేనివి అని పెట్టుబడిదారులకు ఇందుమూలంగా హెచ్చరిస్తున్నాము" అని సెబీ పేర్కొంది. ఈ లావాదేవీలు ఎక్స్ఛేంజ్ ఫ్రేమ్‌వర్క్ వెలుపల జరుగుతాయని, నియంత్రణ పర్యవేక్షణకు లోబడి ఉండవని, ఎటువంటి సెటిల్‌మెంట్ హామీ లేదా పెట్టుబడిదారుల రక్షణను కలిగి ఉండవని, ఎటువంటి అధికారిక ధర-నిర్ణయ ప్రక్రియను అనుసరించవని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఈ గణాంకాలను ప్రచురించడం పెట్టుబడిదారులకు హాని కలిగించవచ్చని, సెక్యూరిటీల మార్కెట్‌లో పారదర్శకత, జవాబుదారీతనం సూత్రాలకు విరుద్ధంగా ఉంటుందని సెబీ వివరించింది.

SEBI

పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి, సెక్యూరిటీల మార్కెట్‌లో పారదర్శకత, సమగ్రతను కొనసాగించడానికి, గ్రే మార్కెట్ ప్రీమియం అని పిలువబడే ఇటువంటి అనియంత్రిత ప్రీ-లిస్టింగ్ ప్రీమియంను ఏ పద్ధతిలో లేదా ప్లాట్‌ఫారమ్‌లోనైనా ప్రచురించడం, ప్రదర్శించడం, పంపిణీ చేయడం లేదా వ్యాప్తి చేయడాన్ని సెక్యూరిటీల మార్కెట్ అంతటా నిలిపివేయవచ్చని సెబీ తన ప్రకటలో పేర్కొంది. జీఎంపీ లావాదేవీలకు సంబంధించిన వివాదాలలో ఎలాంటి నియంత్రణపరమైన పరిష్కారం అందుబాటులో ఉండదని కూడా సెబీ స్పష్టం చేసింది. పెట్టుబడిదారులకు సెబీ లేదా స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికార పరిధిలో రక్షణ లభించదని తెలిపింది.

అలాగే, వారు ఎక్స్ఛేంజ్‌లు నడిపే ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను గానీ, ఎక్స్ఛేంజ్‌లు మరియు డిపాజిటరీలు నిర్వహించే ఆన్‌లైన్ వివాద పరిష్కార పోర్టల్‌ను గానీ ఉపయోగించుకోలేరని సెబీ పేర్కొంది. అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మార్కెట్ సెంటిమెంట్, ప్రీ-లిస్టింగ్ కొనుగోలుదారు లేదా విక్రేత ఆసక్తి, సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లు, కంపెనీ ప్రాథమిక అంశాలు లేదా వాల్యుయేషన్ ఆధారంగా జీఎంపీని ప్రచురిస్తాయి. ఈ అంశాలలో ఏవైనా మార్పులు జరిగితే ఇవి వేగంగా మారవచ్చు, లిస్టింగ్ ధరను ప్రతిబింబించకపోవచ్చు. ఇటీవలి కొన్ని ఐపీఓలలో, ముఖ్యంగా పెద్దవాటిలో, జీఎంపీ వాస్తవ లిస్టింగ్ ధరతో సరిపోలలేదని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+