Paytm: పేటీఎంకు షాక్.. షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు..!
పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 7న ఆ బ్యాంక్‌ను గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి అధికారికంగా తొలగించింది. నిబంధనలను పాటించనందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర బ్యాంక్ పీపీబీఎల్ బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ బ్యాంక్ వ్యవహారాలు దాని డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరమైన రీతిలో నిర్వహించిన నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ను మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు చేపట్టింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని రెండవ షెడ్యూల్ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను మినహాయించినట్లు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై జూలై 31న ఒక నోటిఫికేషన్ జారీ చేయగా, సెప్టెంబర్‌లో అది గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. విజయ్ శేఖర్ శర్మ ప్రమోట్ చేసిన ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం అనుబంధ సంస్థ అయిన పీపీబీఎల్ గతంలో పలుమార్లు పలు విమర్శలు ఎదుర్కొంది. మార్చి 2022లో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా కేంద్ర బ్యాంకు దానిపై నిషేధం విధించింది. లైసెన్స్‌ను రద్దు చేస్తూ బ్యాంకు వ్యవహారాలు దాని స్వంత ప్రయోజనాలకు, అలాగే దాని డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరమైన రీతిలో నిర్వహించబడుతున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.

బ్యాంకు ఐటీ వ్యవస్థపై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించడానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆడిట్ సంస్థను నియమించాలని కూడా ఆదేశించింది. తదనంతరం 2024 జనవరి 31న, 2024 ఫిబ్రవరి 16 అప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లకు ఎలాంటి తదుపరి డిపాజిట్లు / క్రెడిట్‌లు / టాప్-అప్‌లను తీసుకోకూడదని ఆర్బీఐ స్పష్ట చేసింది. బ్యాంక్ కార్యకలాపాలు నిలిపివేసినా లేదా మూసివేసినా, తన డిపాజిట్ బాధ్యతలన్నింటినీ తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు లభ్యత బ్యాంకు వద్ద ఉందని ఆర్బీఐ తెలిపింది. అలాగే వినియోగదారులు గతంలోలాగే UPI, రీఛార్జ్‌లు, చెల్లింపుల కోసం Paytm యాప్‌ను ఉపయోగించకోవచ్చని తెలిపింది.
RBI చర్య నేపథ్యంలో, One97 Communications తన కంపెనీ నివేదికలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇబ్బందుల్లో ఉన్న PPBLలో తన పెట్టుబడి విలువను 2024 మార్చి 31 నాటికే తగ్గించి చూపినందున, ఆ సంస్థతో తనకు ఎటువంటి ఆర్థిక సంబంధిత ముప్పు లేదని పేర్కొంది. తన అనుబంధ సంస్థ అయిన Paytm Payments Bank Limitedపై RBI నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ, Paytm యాప్, Paytm UPI, Paytm QR, Soundbox, కార్డ్ మెషీన్లు, Payment Gateway వంటి కీలక సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
