NSE IPO: ఎన్ఎస్ఈ ఐపీఓకు భారీగా స్పందన.. రెండో రోజే పూర్తిగా సబ్స్క్రైబ్..!

ఎన్ఎస్ఈ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ ఐపీఓ రెండో రోజు పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇనిస్టిస్టుషనల్ బయ్యర్స్ 1.32 రెట్లు, ఎన్ఐఐ 1.45 రెట్లు, రిటైల్ విభాగంలో 0.68 రెట్లు, ఉద్యోగుల భాగం 1.4 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. మధ్యాహ్నం 2:44 గంటల సమయానికి ఆఫర్‌లో ఉన్న 8.86 కోట్ల షేర్లకు గాను, సుమారు 8.83 కోట్ల షేర్లకు బిడ్లు అందాయి. ఈ ఇష్యూ భారతదేశంలోని అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్‌లలో ఒకటి గా ఉంది. 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల ఇష్యూ తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద IPOగా నిలిచింది.

బుధవారం నాడు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), గోల్డ్‌మన్ సాక్స్, ఫిడిలిటీలతో సహా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి NSE రూ. 6,746 కోట్లు సమీకరించింది. ఈస్ట్‌స్ప్రింగ్, HSBC గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో పాటు, GIC సింగపూర్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ మరియు నార్జెస్ బ్యాంక్ వంటి సావరిన్ వెల్త్ ఫండ్‌లు కూడా ఈ యాంకర్ రౌండ్‌లో పాల్గొన్నాయి. ప్రధాన కేటాయింపులో భాగంగా ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులకు దాదాపు $703.04 మిలియన్ల విలువైన షేర్లను కేటాయించగా ఎల్ఐసీ అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచింది. NSE IPOలో ప్రస్తుత వాటాదారులు 12.64 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో విక్రయిస్తోంది.

NSE IPO

ఇది పూర్తిగా OFS కాబట్టి, దీని ద్వారా వచ్చే ఆదాయం షేర్లను విక్రయించే వాటాదారులకే చెందుతుంది. ఈ ఇష్యూ నుండి NSEకి ఎటువంటి నిధులు అందవు. ఎక్స్ఛేంజ్ ఒక్కో షేరుకు రూ. 1,700-1,785 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ శ్రేణిలోని గరిష్ట ధర వద్ద NSE విలువ రూ. 4.42 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతంలో ప్రణాళిక చేసిన 14.9 కోట్ల షేర్ల నుంచి OFS పరిమాణాన్ని తగ్గించడం వల్ల, ఇష్యూ పరిమాణం దాదాపు రూ. 30,000 కోట్లగా అంచనా వేశారు. తర్వాత కాస్త తగ్గించారు. పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 21న ముగుస్తుంది. ఎన్‌ఎస్‌ఈ షేర్లు సెప్టెంబర్ 24న మార్కెట్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కో-లొకేషన్ వివాదానికి సంబంధించిన సమస్యలతో సహా, నియంత్రణపరమైన అడ్డంకుల మధ్య దాదాపు దశాబ్దకాలంగా నిలిచిపోయిన ఎన్‌ఎస్‌ఈ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ప్రయత్నాలలో ఈ ఐపీఓ ఒక కీలక ముందడుగు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+