NSE IPO: ఎన్ఎస్ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఒక్కో షేరు ధర రూ. 1,750 నుంచి రూ.1,785..!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కు రంగం సిద్ధమైంది. ఎన్ఎస్ఈ ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు ధర రూ. 1,750 నుంచి రూ.1,785 నిర్ణయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ధరల శ్రేణిలో గరిష్ట స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాప్ విలువ రూ.4.41 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ IPO పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) పద్ధతిలో ఉండనుంది. NSE IPO విలువ దాదాపు రూ.30,000 కోట్లు ఉండవచ్చని, అధికారిక ధరల శ్రేణి సెప్టెంబర్ 11న ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 25న లిస్టింగ్ జరగవచ్చని తెలుస్తోంది.
మోర్గాన్ స్టాన్లీ వంటి కొన్ని వాటాదారులు తమ వాటాల విక్రయ పరిమాణాన్ని తగ్గించుకోవడం వల్ల ఎన్ఎస్ఈ ఐపీఓ పరిమాణం గతంలో అనుకున్న దాని కంంటే 6 శాతం నుంచి 5.5 శాతాకి తగ్గవచ్చని కూడా వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్ఈ ఈ రోజు సెబీకి సవరించిన DRHPని దాఖలు చేసే అవకాశం ఉందని, అధికారిక ధరల శ్రేణి సెప్టెంబర్ 15న ప్రకటించబడవచ్చని సమాచారం. అలాగే ఈ ఇష్యూ సెప్టెంబర్ 17న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థలు ఐపీఓలో తమ వాటాలను కొంత వరకు విక్రయించనున్నాయి.

నియంత్రణ సంస్థల ఆమోదానికి లోబడి ఎన్ఎస్ఈ ఐపీఓలో తన మొత్తం వాటాలో 35 శాతం లేదా 76.9 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా మంగళవారం నాడు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. OFS ప్రక్రియలో భాగంగా ఎన్ఎస్ఈ షేర్లను సెప్టెంబర్ 8న ఎస్క్రో ఖాతాకు బదిలీ చేశారు. 2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా NSE నుంచి డివిడెండ్‌గా రూ.76.9 కోట్లను పొందింది. SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, GIC Re, న్యూ ఇండియా అస్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ , స్టాక్‌హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివి ఎన్ఎస్ఈ ఐపీఓలో వాటాలను విక్రయించనున్నాయి.
ప్రైవేట్ సంస్థల విషయానికొస్తే, మోర్గాన్ స్టాన్లీ, క్రిస్ క్యాపిటల్ (ChrysCapital), CPPIB (కెనడియన్ పెన్షన్ ఫండ్), ICICI లంబార్డ్, టెమాసెక్ (Temasek), TA అసోసియేట్స్ వంటివి వాటాలను విక్రయించే సంస్థల జాబితాలో ఉన్నాయి. NSEలో మొత్తం 1.7 లక్షల మంది వాటాదారులు ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
