Milky Mist Dairy Food IPO: మంగళవారం నుంచి మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ ఐపీఓ.. గ్రే మార్కెట్ ఎలా ఉందంటే..!
ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ అయిన మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) మంగళవారం, ఆగస్టు 11న ప్రారంభం కానుంది. ఆగస్ట్ 13న ముగియనుంది. కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.1,553 కోట్లు సేకరించినుంది. ఇందులో ష్యూలో కొత్త షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్(OFS) ఉన్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. సోమవారం ఉదయం నాటికి మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ షేర్ల గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ.26గా ఉంది. దీనిని బట్టి చూస్తే ఈ స్టాక్ ఇష్యూ ధర కంటే దాదాపు 19% ప్రీమియంతో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఇష్యూ ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.133 నుంచి రూ.140 మధ్య నిర్ణయించారు. మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ ఐపీఓలో రూ.1,428 కోట్లు విలువైన 10.20 కోట్ల కొత్త షేర్ల జారీతో పాటు రూ.125 కోట్ల విలువైన 89 లక్షల షేర్ల 'ఆఫర్ ఫర్ సేల్' ఉన్నాయి. ఆఫర్ ఫల్ సేల్ అంటే కంపెనీలో ఉన్నవారు వారి షేర్లును అమ్ముకోవడం. ఈ ఐపీఓలో 50% వాటా అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs), 15% వాటా సంస్థాగతేతర పెట్టుబడిదారులకు (NIIs) కేటాయించారు. మిగిలిన 35% వాటా రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించారు. ఒక లాట్ 107 షేర్లు వస్తాయి.

రిటైల్ పెట్టుబడిదారులకు కనీస లాట్ కోసం బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక లాట్ కు రూ.14,980 చెల్లించాల్సి ఉంటుంది. రిటైల్ పెట్టుబడిదారులకు గరిష్ట లాట్ పరిమాణం 13 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీస్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, కేఫిన్ టెక్నాలజీస్ 'రిజిస్ట్రార్'గా ఉంది. షేర్ల కేటాయింపు ఆగస్టు 14న ఖరారయ్యే అవకాశం ఉంది. షేర్లు పొందిన బిడ్డర్లు (దరఖాస్తుదారులు) తర్వాతి పనిదినమైన సోమవారం ఆగస్టు 17న వాటిని పొందుతారు. షేర్లు రాని వారికి అదే రోజున డబ్బు వాపసు (రీఫండ్) అవుతుంది. ఈ ఐపీఓ మంగళవారం, ఆగస్టు 18న BSE, NSEలలో లిస్ట్ కానుంది.
మిల్క్ మిస్ట్ డైయిరీ ఫుడ్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీగా ఉంది. ఆర్హ్పీ ప్రకారం ఆదాయం పరంగా రూ.1,500 కోట్లకు పైగా ఆదాయం కలిగిన భారతీయ కంపెనీలలో ఇది ఒకటి. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం FY24లో రూ.1,821.6 కోట్లుగా ఉండగా, అది FY25లో రూ.2,349.5 కోట్లు ఉండగా FY26లో ₹3,138.4 కోట్లకు పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications