LIC: 35 రోజుల్లోనే రూ.21,000 కోట్ల కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించిన ఎల్ఐసీ..!
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పలు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఎల్ఐసీ ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడి పెడుతోంది. తాజా ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకులో భారీగా వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అయితే బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేయడానికి ఆర్బీఐ అనుమతి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐసీఐసీఐలో వాటాను కొనుగోలు చేయాడానికి ఆర్బీఐ అనుమతి కోరింది. ఎల్ఐసీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఇండియా.. ఐసీఐసీఐ బ్యాంకులో గరిష్టంగా 9.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఇందుకు సంబంధించి బ్యాంకు శనివారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం సెప్టెంబరు 4, 2027 నాటికి ఎల్‌ఐసీ ఈ వాటా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇచ్చిన గడువులోగా వాటాలను కొనకపోతే, ఆర్‌బీఐ ఇచ్చిన ఈ అనుమతి రద్దవుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ పేర్కొంది. ఈ వాటా కొనుగోలు వ్యవహారమంతా చట్టబద్ధమైన, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది. గత నెలలోనే ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోనూ గరిష్ఠంగా 9.99 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీకి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐటీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలను ఆర్జించింది. ప్రపంచం అంతా ఏఐ మయం అవవడంతో భారత సంప్రదాయ ఐటీ కంపెనీల పని అయిపోయిందని చాలా మంది అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు షేర్లు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ వినూత్నంగా ఆలోచించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు పెట్టిన తర్వాత ఐటీ షేర్లు పుంజుకున్నాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పెట్టుబడి 35 రోజుల్లోనే రూ.21,000 కోట్ల కంటే ఎక్కువ లాభాన్ని పొందింది. తొలి త్రైమాసికం ముగిసేనాటికి ఈ మూడు ఐటీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.1.05 లక్షల కోట్లకు చేరగా.. ఆగస్టు 4 నాటికి అది రూ.1.26 లక్షల కోట్లకు పేరిగంది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
