Jio IPO: రికార్డు సృష్టించిన జియో ఐపీఓ.. షేర్లు వచ్చిన వారికి పండగే..!
దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా వచ్చిన జియో ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ వచ్చింది. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ రూ. 30,200 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) 18.55 రెట్లు సబ్స్క్రిప్షన్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) 56.15 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NIIs) 13.87 పెట్లు, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ (RIIs) 2.65 రెట్లు,
ఉద్యోగుల రిజర్వేషన్ 2.87 రెట్లు, షేర్‌హోల్డర్ల రిజర్వేషన్ 7.50 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి అసాధారణమైన స్పందన లభించింది. ఇది అనుకూలమైన లిస్టింగ్ జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అక్టోబర్ 23న ఉదయం 7:37 గంటల సమయానికి, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) షేరుకు రూ. 240గా ఉంది. ఐపీఓ ధరల శ్రేణిలో గరిష్ట ధర రూ. 1,119గా ఉన్నందున, దీని ప్రకారం షేరు దాదాపు రూ. 1,359 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 21.45% లాభం లభించవచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) అనేది మార్కెట్ సెంటిమెంట్‌ను సూచించే ఒక అనధికారిక సంకేతం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఇది షేర్లు ఖచ్చితంగా అదే ధరకు లిస్ట్ అవుతాయని హామీ ఇవ్వదు. చివరి రోజున పెట్టుబడి పెట్టాలనుకునే వారు అన్ని పరిశీలించి పెట్టుబడి పెట్టొచ్చు.

జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓలో ఒక లాట్ అంటే 12 షేర్లు ఉంటాయి. గరిష్ట ధర శ్రేణి రూ. 1,119 వద్ద ఒక రిటైల్ పెట్టుబడిదారుడు ఒక లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రూ. 13,428 అవసరమవుతుంది. ఒకవేళ స్టాక్ ఇష్యూ ధర కంటే 20% ప్రీమియంతో లిస్ట్ అయితే, అంచనా వేసిన లిస్టింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 1,342.80 అవుతుంది. దీని అర్థం ఒక్కో షేరుపై రూ. 223.80 స్థూల లాభం వస్తుంది. అంటే 12 షేర్లు ఉన్న ఒక లాట్‌పై మొత్తం రూ. 2,685.60 లాభం లభిస్తుంది. 20% లిస్టింగ్ లాభం వస్తుందని భావిస్తే, కేటాయించబడిన లాట్ల సంఖ్యను బట్టి లాభం ఎలా మారుతుందో ఇక్కడ చూడవచ్చు.
జియో ప్రపంచవ్యాప్తంగా కోటి దరఖాస్తుల మార్కును దాటిన మొట్టమొదటి ఐపీఓగా ఇది నిలిచింది. గతంలో వారీ ఎనర్జీస్‌కు అందిన దాదాపు 97 లక్షల దరఖాస్తుల రికార్డును ఇది అధిగమించింది. వాల్యూవేషన్ పరంగా చూస్తే ఎయిర్ టెల్ కంటే.. జియో ఎక్కువ వాల్యూవేషన్ లో వస్తోంది. అయితే దేశంలో ఎయిర్ టెల్, జియో మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో జియో ఐపీఓకు భారీ డిమాండ్ వచ్చింది. పైగా ఇది రియన్స్ ఇండస్ట్రీ కంపెనీ కాబట్టి చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications