IT Stocks: జూలైలో దూకుడు పెంచిన ఐటీ స్టాక్స్.. 16 శాతం పెరిగిన ఐటీ ఇండెక్స్..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రాకతో భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గత కొద్ది నెలలకు ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా తో పాటు చాలా ఐటీ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఈ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. జూన్ లో భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ కంపెనీలు జూలైలో మాత్రం పుంజుకున్నాయి. జూలైలో ఐటీ ఇండెక్స్ దాదాపు 16 శాతం పెరిగింది. జూలైలో టాప్ కంపెనీలు అన్నీ కలిపి రూ.3.82 లక్షల కోట్ల మార్కెట్ విలువను పెంచుకున్నాయి.
ఏఐకి సంబంధించి బజ్ తగ్గడంతో ఐటీ షేర్లు రాణిస్తున్నాయి. షార్ట్ సెల్లార్లు తమ పొజిషన్లు మూసివేయడంతో ఐటీ స్టాక్స్ లో ర్యాలీ కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ లోని 10 కంపెనీ షేర్లు లాభపడ్డాయి. జూలైలో అత్యధికంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ 26 శాతం వరకు పెరిగింది. ఇక హెచ్సీఎల్ టెక్నాలజీస్ 25 శాతం వరకు పెరిగ్గా.. ఎల్టీఐ మైండ్ ట్రీ సుమార్ 25 శాతం ర్యాలీ అయింది. అయితే ఇన్ఫోసిస్ మాత్రం ఆశించిస్థాయిలో రాణించలేకపోయింది. ఇన్ఫోసిస్ షేర్లు 15.35 శాతం పెరిగాయి. టీసీఎస్ ఈ నెలలో 20 శాతం పెరగ్గా టెక్ మహీంద్రా 16.9 శాతం, కో ఫోర్జ్ 16.67 శాతం పెరిగాయి.

మార్కెట్ విలువ పరంగా చూస్తే టీసీఎస్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. టీసీఎస్ మార్కెట్ విలువ సుమారు రూ. 1.48 లక్షల కోట్లు పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ విషయానికి వస్తే దీని మార్కెట్ విలువ రూ. 73 వేల కోట్లకుపైగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌కు మార్కెట్ విలువ రూ. 62,122 కోట్లు పెరిగింది. ఐటీలో పెరిగిన మొత్తం మార్కెట్ విలువలో ఈ 3 కంపెనీల వాటానే సుమార్ మూడు వంతులుగా ఉంది. అయితే కొత్త పెట్టుబడులు వచ్చి ఈ స్టాక్స్ పెరగలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సెల్లర్స్ తమ బేరిష్ పొజిషన్లను క్లోజ్ చేయడం వల్లే స్టాక్ ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ర్యాలీ ఇలానే కొనసాగుతుందా అనే ప్రశ్నలకు మాత్రం ఎవరు సమాధానం చెప్పడం లేదు.
మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ పెరిగింది. దీంతో ఏఐ స్టాక్స్ పడిపోతున్నాయి. ఇదే సమయంలో కనిష్ట స్థాయిలో ఉన్న భారత ఐటీ కంపెనీలపై ప్రపంచ పెట్టుబడిదారులు చూస్తున్నట్లు పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంటున్నాయి. ఇప్పుడే తొందరపడి కొనడం కంటే.. రెండు, మూడు త్రైమాసిక ఫలితాలు చూసి కొనుగోలు చేయడం బెటరని సూచిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications