Next Week IPO's: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వచ్చే వారం ఐదు ఐపీఓలు..!
సింబయోటిక్ ఫార్మాల్యాబ్, హై-టెక్ ఇంజనీర్స్, స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్, అను ప్రాజెక్ట్స్, లుమినో ఇండస్ట్రీస్ మొదలైన అనేక ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లు (IPOలు) వచ్చే వారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం కానున్నాయి. ఈ IPOలతో పాటు, కేటాయింపు అనంతరం దాదాపు 8 ఆఫరింగ్‌లు దలాల్ స్ట్రీట్‌లో అరంగేట్రం చేయనున్నాయి. ఇందులో 'టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఇండియా) లిమిటెడ్' 'ఆగ్‌మాంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్'ల మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 'స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్', 'సింబియోటెక్ ఫార్మాలాబ్ లిమిటెడ్', 'హై టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్'ల ఐపీఓలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 'అన్ను ప్రాజెక్ట్స్ లిమిటెడ్' ఐపీఓ మంగళవారం సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది.
టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఇండియా) లిమిటెడ్ తన ఐపీఓను గురువారం ఆగస్టు 20న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఆగస్టు 24న సోమవారం ముగుస్తుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 285 నుంచి రూ. 300 వరకు ఉంది. ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. ఆగ్‌మాంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తన ఐపీఓను శుక్రవారం ప్రారంభం అయింది. ఆగస్టు 25న ముగుస్తుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 750 నుంచి రూ. 788 వరకు నిర్ణయించింది. ఈ కంపననీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓ సోమవారం, ఆగస్టు 24న సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ కానుంది. ఈ ఐపీఓ ఆగస్టు 27న ముగించనుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 131 నుండి రూ. 138 వరకు ధరలను నిర్ణయించింది.

స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓ రూ. 582 కోట్ల విలువైన 'బుక్-బిల్ట్' ఇష్యూ. ఇందులో రూ. 398 కోట్ల విలువైన 2.89 కోట్ల కొత్త షేర్ల జారీ చేయనున్నారు. రూ. 184 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండనుంది. సింబియోటెక్ ఫార్మాలాబ్ లిమిటెడ్ ఐపీఓ ఆగస్టు 24న ప్రారంభం కానుంది. ఆగస్టు 27న ముగించనుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 938 నుండి రూ. 988 గా నిర్ణయించారు. ఈ IPO రూ. 1,757 కోట్ల విలువైన 'బుక్-బిల్ట్' ఇష్యూ. ఇందులో రూ. 150 కోట్ల విలువైన 0.15 కోట్ల కొత్త షేర్ల జారీ, రూ. 1,607 కోట్ల విలువైన 1.63 కోట్ల షేర్ల 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) ఉండనుంది. హై టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ తన ఐపీఓ ఆగస్టు 24న కానుంది. ఆగస్టు 27న ముగించనుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 50 నుండి రూ. 53 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది.
ఇది రూ. 135.73 కోట్ల విలువైన 'బుక్-బిల్ట్' ఇష్యూ. ఇందులో రూ. 60 కోట్ల విలువైన 1.13 కోట్ల కొత్త షేర్ల జారీతో పాటు, రూ. 75.73 కోట్ల విలువైన 1.43 కోట్ల షేర్ల 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) కూడా ఉన్నాయి. అను ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తన ఐపీఓ (IPO) మంగళవారం ప్రారంభం కానుంది. శుక్రవారం ముగియనుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 94 నుంచి రూ. 99గా నిర్ణయించింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్‌స్ట్రక్షన్ (EPC) రంగానికి చెందిన ఈ కంపెనీ IPO, రూ. 175 కోట్ల విలువైన 'బుక్-బిల్ట్' ఇష్యూ. ఇది పూర్తిగా కొత్త షేర్ల జారీ (fresh issue) కాగా, ఇందులో రూ. 175.06 కోట్ల విలువైన 1.77 కోట్ల షేర్లు ఉన్నాయి.
రూ. 700 కోట్ల విలువైన లూమినో ఐపీఓ (IPO), రూ. 500 కోట్ల విలువైన 6.10 కోట్ల కొత్త షేర్ల జారీ, రూ. 200 కోట్ల విలువైన 2.44 కోట్ల విలువైన (OFS) షేర్లు ఉన్నాయి. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం ఆగస్టు 27న ప్రారంభమై, ఆగస్టు 31న ముగుస్తుంది. షేర్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబర్ 1న ఖరారవుతుంది, సెప్టెంబర్ 3న స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఈ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications