Lalithaa Jewellery Mart IPO: డబ్బులు ఊరికే రావు.. ఐపీఓగా వస్తున్న లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్..

లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓగా రానుంది. ఫేస్ వాల్యూ రూ.5తో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించారు. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ఆగస్ట్ 17 సోమవారం ప్రారంభమై ఆగస్ట్ 19 బుధవారం ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు శుక్రవారం ఆగస్ట్ 14న జరుగుతుంది. ఈ ఐపీఓలో ఒక లాట్ పరిమాణం 74 ఈక్విటీ షేర్లుగా నిర్ణయించారు. పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ కు రూ.14,874 ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (QIB) గరిష్టంగా 50 శాతం కేటాయించారు.

సంస్థాగతేతర పెట్టుబడిదారులకు (NII) 15 శాతం కేటాయించారు. రిటైల్ పెట్టుబడిదారులకు కనీసం 35 శాతం కేటాయించారు. కంపెనీ తన ఉద్యోగుల కోసం రూ.6 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. వీటిని తుది ఆఫర్ ధరపై 10 శాతం తగ్గింపుతో అందించే అవకాశం ఉంది. షేర్ల కేటాయింపు ఆగస్ట్ 20న జరిగే అవకాశం ఉంది. ఆగస్ట్ 21 డీమాట్ అకౌంట్లలో షేర్లు యాడ్ అవుతాయి. షేర్లు రాని వారికే అదే రోజు రీఫండ్ ఉంటుంది. ఆగస్ట్ 24న లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ షేర్లు BSE, NSEలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈఐపీఓలో రూ.1,200 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ (fresh issue) ఉంటుంది.

Lalitha jewellary

అలాగే ప్రమోటర్, వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ జైన్ 'ఆఫర్-ఫర్-సేల్' (OFS) ద్వారా రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు. తమ విస్తరణ వ్యూహంలో భాగంగా దక్షిణ భారతదేశం అంతటా 10 కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడానికి కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చిన నిధులలో రూ.1,033.2 కోట్ల వరకు వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఖర్చులో ఫర్నిచర్, ఫిక్చర్లు, పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్ & సాఫ్ట్‌వేర్, ఇన్వెంటరీ అవసరాలతో సహా స్టోర్ ఏర్పాటుకు సంబంధించిన వ్యయాలు ఉంటాయి.

కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చిన మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు. కాగా OFS ద్వారా వచ్చిన ఆదాయం ప్రమోటర్‌కు చెందుతుంది. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓ (IPO) కోసం ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్ క్యాపిటల్ సంస్థలు మర్చంట్ బ్యాంకర్లుగా నియమించారు. 'లలితా' బ్రాండ్ పేరుతో, దక్షిణ భారత మార్కెట్‌లోని ప్రాంతీయ అభిరుచులకు అనుగుణంగా బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలను ఈ సంస్థ విక్రయిస్తోంది. ఈ కంపెనీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలో మొత్తం 61 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిలో 45 స్టోర్లు టైర్-2, టైర్-3 నగరాల్లో ఉన్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+