Star Health: స్టార్ హెల్త్‌లో వాటా కొనుగోలుకు హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్‌కు ఐఆర్డీఏఐ గ్రీన్ సిగ్నల్..
హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఆమోదం తెలిపిందని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఎక్సేంజ్ లకు సమాచారం ఇచ్చింది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ ఇప్పటికే కలిగి ఉన్న 4.49% వాటాను కలిగి ఉంది. ఇప్పుడు దాని చెల్లింపు వాటా మూలధనంలో 9.99% వరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆమోదంతో, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ పథకాలు తమ ఉమ్మడి వాటాను ప్రస్తుత స్థాయి నుంచి 5.50 శాతం పెరుగుతుంది.
నవంబర్ 9 నాటి ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అదే రోజు జారీ చేసిన ఒక లేఖ ద్వారా బీమా నియంత్రణ సంస్థ తన ఆమోదాన్ని మంజూరు చేసిందని స్టార్ హెల్త్ తెలిపింది. కంపెనీ చెల్లింపు మూలధనంలో 9.99% (ప్రస్తుత పెట్టుబడి అయిన 4.49%తో సహా) వరకు కంపెనీ ఈక్విటీ షేర్లను హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ పథకాలు కొనుగోలు చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) 09 నవంబర్ 2026 నాటి లేఖ ద్వారా ఆమోదం తెలిపిందని స్టార్ హెల్త్ ప్రకటించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వారి లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్స్, 2015లోని రెగ్యులేషన్ 30 ప్రకారం బీమా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన త్రైమాసికానికి స్టార్ హెల్త్ వాటాదారులను చూస్తే HDFC మ్యూచువల్ ఫండ్ దాదాపు 2.64 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఇది కంపెనీ ఈక్విటీ మూలధనంలో 4.49 శాతానికి సమానం. సెప్టెంబర్ చివరి నాటికి మ్యూచువల్ ఫండ్లు అన్ని కలిపి ఈ బీమా సంస్థలో 10.43% వాటాను కలిగి ఉన్నాయి. స్టార్ హెల్త్ ప్రమోటర్లు కంపెనీలో దాదాపు 58 శాతం వాటాను కలిగి ఉన్నారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా LLP 40.17% వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉండగా, దాని తర్వాత సితారా పార్టనర్స్ LLP 13.29% వాటాతో ఉంది. ఇతర సంస్థాగత పెట్టుబడిదారులలో, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 4.32% వాటాను కలిగి ఉండగా, SBI బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 3.31% వాటాను కలిగి ఉంది.
స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థ ఈ త్రైమాసికంలో పన్ను తర్వాత రూ. 265 కోట్ల లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది దాదాపు రూ. 80 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 233% పెరుగుదలను నమోదు చేసింది. దీని సాధారణీకరించిన పన్ను అనంతర లాభం గతేడాదితో పోలిస్తే 70 శాతం పెరిగి రూ. 390 కోట్లకు చేరింది. కంపెనీ అండర్‌రైటింగ్ లాభం గత ఏడాది రూ. 40 కోట్ల నష్టం నుంచి రూ. 99 కోట్లకు మెరుగుపడింది. అండర్‌రైటింగ్ లాభదాయకతలో ఇది వరుసగా ఐదవ త్రైమాసికం మెరుగుదలను సూచిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications