MultiBagger Stock: రూ.లక్ష పెట్టుబడిని రూ.1.2 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..
స్టాక్ మార్కెట్ ద్వారా సంపదను సృష్టించడానికి సమయం, సహనం, క్షుణ్ణమైన పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు. మల్టీబ్యాగర్ రిటర్న్స్ రావాలంటే మంచి కంపెనీలను గుర్తించి అందులో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తున్న స్టాక్స్ లో క్యూపిడ్ కంపెనీ ఒకటి. క్యూపిడ్ షేర్ స్వల్పకాలంలో మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం బలమైన సానుకూల ధోరణిని ప్రదర్శించింది. గత వారంలో ఈ స్టాక్ 0.44 శాతం, గత నెలలో 4.83 శాతం మేర క్షీణించింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే క్యూపిడ్ షేర్ ధర 166.43 శాతం పెరిగింది. ఇది 2026లో స్టాక్ బలమైన జోరును సూచిస్తోంది. ఏడాది కాలంలో దీని పనితీరు మరింత ఆకట్టుకునేలా ఉంది. ఈ స్టాక్ 605.24 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఈ స్టాక్ పెట్టుబడిదారుల డబ్బును భారీగా పెంచింది. మూడేళ్లలో 6,623.56 శాతం, ఐదేళ్లలో అసాధారణమైన 11,956.03 శాతం వృద్ధితో పెట్టుబడి విలువను నాలుగింతలకు పైగా పెంచింది. నాలుగేళ్ల క్రితం ఈ స్టాక్‌లో పెట్టిన రూ.1 లక్షల పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.1.2 కోట్లకు చేరి ఉండేది. అలాగే మూడేళ్ల క్రితం పెట్టిన అంతే మొత్తంలోని పెట్టుబడి విలువ ఇప్పుడు సుమారు రూ.67 లక్షలుగా ఉండేది.

అదేవిధంగా ఏడాది క్రితం పెట్టిన పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.7 లక్షలకు చేరగా ఈ ఏడాది ప్రారంభం నుండి చూస్తే అది రూ.2.6 లక్షలకు పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2027 (FY27) మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ.44 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15 కోట్ల లాభంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 159 శాతం పెరిగి రూ.155 కోట్లకు చేరింది. ఎబిట్టా ఏడాది ప్రాతిపదికన 265 శాతం భారీగా పెరిగి రూ.60 కోట్లకు చేరగా, ఎబిట్డా మార్జిన్ 1,127 బేసిస్ పాయింట్లు పెరిగి 39 శాతానికి చేరింది.
అంతర్జాతీయ B2B హెల్త్‌కేర్, దేశీయ కన్స్యూమర్ హెల్త్‌కేర్, FMCG వ్యాపారాలలో మంచి పనితీరుతో పాటు కీలక విభాగాలలో సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణ కారణంగా FY27ను బలమైన రీతిలో ప్రారంభించినట్లు క్యూపిడ్ పేర్కొంది. కంపెనీ తన ఎగుమతి పోర్ట్‌ఫోలియో అంతటా ధరలను కనీసం 10 శాతం పెంచింది. ఇది రాబడులు, మార్జిన్‌లను మెరుగుపరచడంలో సహాయపడింది. బలమైన ఆర్డర్ బుక్, పెరుగుతున్న కన్స్యూమర్ హెల్త్‌కేర్, FMCG పోర్ట్‌ఫోలియో, పటిష్టమైన అంతర్జాతీయ B2B డిమాండ్ కంపెనీకి కలిసొచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
