టెన్నెకో క్లీన్ ఎయిర్ అనే కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి లాభాల్లో దూసుకెళ్తోంది. మొదటిరోజే మంచి పర్ఫామెన్స్ ఇస్తున్న ఈ కంపెనీపై ఇన్వెస్టర్లు భారీగా నమ్మకాలు పెట్టుకున్నారు. మరి మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఈ కంపెనీ మున్ముందు ఎలా పర్ఫార్మ్ చేయనుంది? నిపుణులు ఎలా అంచనా వేస్తున్నారు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టెన్నెకో క్లీన్ ఎయిర్ అనేది ఒక క్లీన్ ఎయిర్ టెక్నాలజీ సంస్థ. అంటే కాలుష్యాన్ని నియంత్రించే టెక్నాలజీలను రూపొందిస్తుంటారు. వాహనాలలో ఎగ్జాస్ట్ సిస్టమ్స్, థర్మల్ మేనేజ్ మెంట్, మఫ్లర్లు, ఆయిల్ ఫిల్టర్స్ వంటివి.. ఈ కంపెనీ ప్రధాన ప్రొడక్ట్స్ గా ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఆటోమొబైల్ కంపెనీలతో లింక్ అయి పని చేస్తుంటాయి. అయితే అన్ని ఆటోమొబైల్ బ్రాండ్స్ తో మంచి సంబంధాలు ఉన్న కారణంగా ఈ కంపెనీ లిస్టింగ్ బలంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎంట్రీతోనే లాభం
టెన్నెకో క్లీన్ ఎయిర్ (Tenneco clean air share price) షేర్లు ఈ రోజు (నవంబర్ 19, 2025) స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టాయి. మొదటిరోజే ఈ షేర్లు 3 శాతం కంటే ఎక్కువ లాభపడి బలంగా ట్రేడ్ అయ్యాయి. BSE, NSE రెండింటిలో ఈ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఈ షేర్లు అంచనాలను మించి లిస్ట్ అవుతున్నాయి. కంపెనీ ఐపీఓ ధర.. ఒక్కో షేరుకి రూ.397 నిర్ణయించగా.. NSEలో రూ.505 వద్ద లిస్ట్ అయింది. అంటే ఐపీఓ ధరపై 27.2 శాతం లాభం. అలాగే BSEలో ఈ షేర్ వాల్యూ రూ.498 వద్ద లిస్ట్ అయింది. అంటే ఐపీఓ ధరపై 25.44 శాతం లాభం. ఇక్కడితో ఆగకుండా లిస్టింగ్ తర్వాత కూడా టెన్నెకో షేరు జోరు కొనసాగింది. NSE లో మరో 2.37 శాతం పెరిగి రూ.517 గరిష్ట స్థాయిని తాకింది. అలాగే BSE లో కూడా 3.81శాతం పెరిగి రూ.517 గరిష్ట స్థాయిని తాకింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి
ఈ కంపెనీ పొల్యూషన్ మ్యానేజ్ మెంట్ సిస్టమ్ లపై పనిచేస్తుంది. ఈ తరహా ప్రొడక్ట్స్ కు స్థిరమైన డిమాండ్ ఉంటుంది. అలాగే ఇది ఆటోమొబైల్ రంగంతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఆ రంగం యొక్క హెచ్చుతగ్గుల ప్రభావం ఈ కంపెనీపై పడే అవకాశం ఉంటుంది. నిపుణుల సలహా ప్రకారం ఇన్వెస్టర్లు ప్రస్తుతం కొంత లాభాన్ని బుక్ చేసుకుని.. మిగిలిన వాటిని రూ.480 వద్ద స్టాప్-లాస్ పెట్టుకుని ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం 2:10 గంటల సమయానికి, టెన్నెకో క్లీన్ ఎయిర్ షేరు BSE లో రూ. 501.00 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది లిస్టింగ్ ధర కంటే 0.60% ఎక్కువ, ఐపీఓ ధర కంటే 26.20% ఎక్కువ. అయితే ఓవరాల్ గా కాస్త కిందకు పడుతున్నట్టు అనిపిస్తుంది. ట్రేడ్ ముగిసే సమయానికి ఎలా మారుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications