భారత అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తాజాగా 12వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించడంతో టెక్ రంగం ఒక్కసారిగా షేక్ అయింది. ఈ ప్రకటన స్టాక్ మార్కెట్ ని ఒక్కసారిగా కుదిపేసింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే TCS షేర్లు రూ. 6,550 కోట్ల పెట్టుబడిదారుల సంపదను కోల్పోయింది. వచ్చే ఏడాది కాలంలో 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రకటించిన ఒక రోజు తర్వాత సోమవారం షేర్లు రూ.20 వేల కోట్ల విలువను కోల్పోయిన తర్వాత ఇది జరిగింది. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11.07 లక్షల కోట్లకు పడిపోయింది.
చాలామంది టీసీఎస్‌ను ప్రభుత్వ ఉద్యోగంలా భావిస్తూ..దీంట్లో ఉద్యోగం అంటే జీవితాన్ని సెటిల్ చేసేసుకున్నట్లే అని నమ్మేవారు. సమయానికి జీతం, వేరియబుల్ పే, వృద్ధి అవకాశాలు వంటి అంశాలతో భరోసా కలిగించే కంపెనీగా పేరు సంపాదించింది. అయితే ఈ విధమైన ఉద్యోగ భద్రత ఇక ముందు కనిపించకపోవచ్చని తాజా లేఆప్స్ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ ఉద్యోగాల కోతకు కారణం ఏఐ (Artificial Intelligence) కారణమని చెప్పవచ్చు.

మారుతున్న టెక్నాలజీ, ఆటోమేషన్ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే టీసీఎస్ 12 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఐటీ ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక లాంటి సంకేతం వచ్చినట్లయింది. ఈ ప్రకటన తర్వాత టీసీఎస్ షేర్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,550 కోట్ల మేర తగ్గిపోయింది. అంతకుముందు సోమవారం కూడా కంపెనీ షేర్లపై భారీగా అమ్మకాలు జరగడంతో రూ.20,000 కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ.26,550 కోట్ల నష్టం నమోదైంది. ప్రస్తుతం టీసీఎస్ షేర్ NSEలో రూ.3,044 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవాళ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.3,041ని తాకింది.
2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు టీసీఎస్ స్టాక్ దాదాపు 25 శాతం పతనమైంది. నిపుణులు షేర్ ప్రస్తుత స్థాయికి మించిపోయేలా పడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్ లక్ష్యధరలను తక్కువగా రివైజ్ చేశాయి. పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల కన్నా.. ఎంత లాభం? ఎంత డెలివరీ అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు, ఏఐ ఆధారిత టెక్ నేపథ్యంలో సంస్థలు ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తద్వారా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా హై-స్కిల్ కలిగిన వారినే ఎంపిక చేసుకుంటున్నాయి. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలు కూడా కంపెనీలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చుల తగ్గింపుపై బాగా ఫోకస్ పెట్టాయి. ఐటీ ఉద్యోగాల భవిష్యత్తు ఇకపై సంక్షోభంలోకి వెళ్లేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications