టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఫలితాలను ప్రకటించింది. టీసీఎస్ కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి రూ.12,760 కోట్లకు చేరింది. ఇదే సమయంలో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.12,127 కోట్ల లాభాన్ని సాధించగా..ఈసారి అది రూ.12,760 కోట్లకు చేరుకుంది.
గత త్రైమాసికంతో పోలిస్తే కూడా (రూ.12,224 కోట్లు) లాభం మెరుగైంది. అయితే ఆదాయ పరంగా చూస్తే.. గత త్రైమాసికంలో రూ.64,479 కోట్లు కాగా.. ఇప్పుడు అది స్వల్పంగా తగ్గి రూ.63,437 కోట్లకు చేరుకుంది. స్వల్ప తగ్గుదలను చూసింది. డాలర్ ఆదాయం కూడా 746.5 కోట్ల డాలర్ల నుంచి 742.1 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇక Constant Currency (CC) ఆదాయం 3.3 శాతం తగ్గింది.

కంపెనీ EBIT అంటే వర్కింగ్ లాభం ఈ త్రైమాసికంలో రూ.15,514 కోట్లుగా ప్రకటించింది. EBIT మార్జిన్ 24.3 శాతంగా అంచనా వేసింది. గత త్రైమాసికంతో పోల్చితే మార్జిన్లు కొంత మెరుగయ్యాయి. కంపెనీ మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) 9.4 బిలియన్ డాలర్లుగా ప్రకటించింది. ఇది మునుపటి త్రైమాసికంలో ఉన్న 12.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే కాస్తా తగ్గింది.అయితే కొత్త సేవలలో మంచి వృద్ధిని కంపెనీ నమోదు చేసింది.
ఈ త్రైమాసికంలో టీసీఎస్ 5,090 మంది కొత్త ఉద్యోగులను తీసుకుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల తొలగింపులు కూడా భారీగానే చేపట్టింది.ఇది గత త్రైమాసికంలో 13.3 శాతం ఉండగా, ఇప్పుడు 13.8 శాతానికి చేరింది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.13 లక్షలు అని తెలిపింది. కంపెనీ CHRO మిలింద్ లక్కాడ్ తెలిపిన ప్రకారం, టీసీఎస్ అసోసియేట్లు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై 1.5 కోట్ల గంటల పాటు శిక్షణ పొందారు. AI నైపుణ్యాలున్న 1,14,000 మంది ఉద్యోగులు కంపెనీలో ఉన్నారని తెలిపారు.
టీసీఎస్ CEO K. కృతివాసన్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల వల్ల డిమాండ్ మీద ఒత్తిడి ఉంది. అయినప్పటికీ మేము ఖర్చులను తగ్గించడం, సరఫరాదారులను ఏకీకృతం చేయడం, AI ఆధారిత వ్యాపార పరివర్తన ద్వారా కస్టమర్లకు విలువను అందిస్తున్నామని తెలిపారు.
ఇక టీసీఎస్ తన షేర్ హోల్డర్ల కోసం ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్ ప్రకటించింది. దీని రికార్డు తేదీని జూలై 16, 2025గా నిర్ణయించారు. క్లుప్తంగా చూసుకున్నట్లయితే టీసీఎస్ లాభాల్లో స్థిరమైన వృద్ధిని సాధించగా.. ఆదాయంలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉద్యోగ నియామకాలను కొనసాగిస్తూనే.. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు తగిన విధంగా AI ఆధారిత పరిష్కారాలను ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ తొలగింపులు చేపడుతోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?



Click it and Unblock the Notifications