Multibagger Stock: 8 నెలల్లో రూ.లక్షను రూ.2.2 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..
GRT జ్యువెలర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 'త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ' (TBZ)లో 74.12 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం (SPA) కుదుర్చుకున్నట్లు ప్రకటించడంతో సోమవారం నాడు TBZ షేర్లు 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. కొత్త 52-వారాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. NSEలో ఈ స్టాక్ రూ.305.75 వద్ద స్థిరంగా ప్రారంభమైనప్పటికీ, వెంటనే బలమైన కొనుగోలు ఆసక్తిని ఆకర్షించి, 20 శాతం ర్యాలీతో ఆ రోజు గరిష్ట ధర పరిమితి అయిన రూ.366.50కి చేరింది. NSEలో అత్యధికంగా ట్రేడ్ అయిన షేర్లలో ఇది ఒకటిగా నిలిచింది. త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ ఒక ఆభరణాల విక్రయ సంస్థ (జ్యువెలరీ రిటైలర్). ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,447.68 కోట్లుగా ఉంది.
త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ షేర్లు గత నెలలో 33 శాతం పెరిగాయి. 2026లో ఇప్పటివరకు 123 శాతం లాభపడి పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు కంటే ఎక్కువగా చేశాయి. దీనికి భిన్నంగా, ఇదే కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 సూచీ నెలలో 1.1 శాతం 8 నెలల్లో 7.7 శాతం క్షీణించింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ అయిన GRT జ్యువెలర్స్, త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ ప్రమోటర్ల వద్ద ఉన్న 74.12 శాతం వాటాను కొనుగోలు చేయడానికి వారితో వాటా కొనుగోలు ఒప్పందం (SPA)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, GRT ప్రమోటర్ల వాటాను గరిష్టంగా రూ.1,033.71 కోట్ల మొత్తం విలువకు కొనుగోలు చేస్తుంది.

అదనంగా మరో 26 శాతం వాటా కోసం GRT 'ఓపెన్ ఆఫర్'ను కూడా ప్రారంభించనుంది. ఫైలింగ్ ప్రకారం GRT జ్యువెలర్స్, త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీకి చెందిన పబ్లిక్ వాటాదారుల నుంచి ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ కలిగిన 1,72,70,845 పూర్తి చెల్లింపు జరిగిన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తుంది. షేరుకు రూ.249.61 చొప్పున, దీనికి మొత్తం నగదు రూపంలో రూ.4,31,09,75,621 వరకు చెల్లింపు జరుగుతుంది. 162 ఏళ్ల వారసత్వ బ్రాండ్ అయిన టీబీజెడ్‌ను సొంతం చేసుకోవడం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ జీఆర్ అనంత్ చెప్పారు. భారతదేశం అంతటా తమ నెట్ వర్క్ విస్తరించాలనే తమ వ్యూహానికి ఇది చాలా చక్కగా సరిపోతుందన్నారు.
ఇప్పటికే టీబీజెడ్‌కు 37 స్టోర్లు ఉన్నాయని... రాబోయే సంవత్సరాల్లో తమ కస్టమర్లు, వాటాదారులు, ఉద్యోగులు, విక్రేతలు, బ్యాంకర్లు, ఇతర భాగస్వాములతో సహా వాటాదారులందరికీ విలువను సృష్టించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. టీబీజెడ్ స్టాక్ బలమైన పెరుగుదల ధోరణిలో ఉందని దాదాపు రూ.110 కనిష్ట స్థాయి నుంచి మూడు రెట్లకు పైగా పెరిగిందని పృథ్వీ ఫిన్‌మార్ట్ ఏవీపీ, టెక్నికల్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ హరీష్ జుజారే అన్నారు. నేటి సెషన్‌లో ఈ స్టాక్ 20 శాతం పెరిగి 366.50 వద్ద సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని గుర్తు చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications