TATA Sons: టాటా సన్స్ ను లిస్టింగ్ నుంచి తప్పించేందుకు టాటా ట్రస్ట్ కీలక ప్రతిపాదన..
టాటా ట్రస్ట్ టాటా సన్స్ ను లిస్టింగ్ నుంచి తప్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ రెండు గ్రూప్ కంపెనీలను విలీనం చేసి ఆపరేటింగ్ కంపెనీగా ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగా
టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 66% వాటాతో మెజారిటీ వాటాదారుగా ఉన్న టాటా ట్రస్ట్స్ టాటా సన్స్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని బోర్డుకు ప్రతిపాదించింది. టాటా సన్స్ లోని రెండు ఆపరేటింగ్ కంపెనీలను మెర్జ్ చేయాలని సూచించింది. ఇలా చేయడం ద్వారా టాటా సన్స్ మార్కెట్ లిస్టింగ్ నుంచి తప్పించవచ్చని భావిస్తోంది. రెండు ఆపరేటింగ్ కంపెనీలను విలీనం చేయడం ద్వారాప్రైవేట్ హోదాను నిలుపుకోవడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం భవిష్యత్తులో అవసరమయ్యే లిస్టింగ్ నిబంధనను నివారించడం లక్ష్యంగా ఒక పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను ప్రతిపాదించింది.
ఈ ప్రణాళికలో భాగంగా టాటా గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలైన టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TESS), టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ (TCE)లను టాటా సన్స్‌లో విలీనం చేయాలని టాటా ట్రస్ట్ కోరింది. ఈ ప్రతిపాదనను బోర్డు కు పంపింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కోరింది. టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ కంపెనీలు విలీనం చేయాలంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రం(నో అబ్జేక్షన్ సర్టిఫికెట్ ) పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ బోర్డుకు లేఖ రాసింది.

ఈ ప్రతిపాదిత పునర్‌వ్యవస్థీకరణ ముఖ్య ఉద్దేశ్యం టాటా సన్స్ ఇకపై నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) లేదా కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) అనే హోదాలను కోల్పోకుండా చూడటం.
టాటా ట్రస్ట్స్ ప్రకారం 2026 మార్చి 31 నాటికి విలీనమైన సంస్థకు రూ. 1.05 లక్షల కోట్ల నిర్వహణా రాబడి ఉంటుంది. ఇది ఆర్థిక ఆస్తుల ద్వారా వచ్చే రూ. 40,072 కోట్ల ఆదాయం కంటే చాలా ఎక్కువ. తద్వారా టాటా సన్స్ ఒక NBFCకి అవసరమైన ప్రధాన వ్యాపార ప్రమాణాల పరిధి నుంచి బయటకు రావడానికి ఇది ఉపయోగపడనుంది. విలీనమైన సంస్థ CIC ప్రమాణాలను కూడా అందుకోదని ట్రస్ట్స్ తెలిపాయి.
దాని నికర ఆస్తులు రూ. 2 లక్షల కోట్లుగా ఉంటాయి, ఇందులో గ్రూప్ కంపెనీలలోని పెట్టుబడులు రూ. 1.77 లక్షల కోట్లుగా ఉంటాయి. ఇది CIC వర్గీకరణకు అవసరమైన 90% పరిమితి కంటే తక్కువ.
2004లో టీసీఎస్ (TCS) ప్రత్యేక అనుబంధ సంస్థగా విడిపోకముందు టాటా సన్స్ సొంతంగా వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు కలిగి ఉండేదని టాటా సన్స్ గుర్తు చేసింది. తాజా విలీనంతో టాటా సన్స్ మళ్లీ తన పాత ఆపరేటింగ్ మోడల్‌లోకి మారనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
