Tata Power Shares: టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ తాజాగా ఏపీ ప్రభుత్వంతో కీలక పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని కింద రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో సహకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూపై సంతకం చేసిందని వెల్లడించటంతో.. నేడు మార్కెట్లో టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ షేర్లు 3 శాతం మేర లాభపడ్డాయి.
ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఒక్కోటి బీఎస్ఈలో 3 శాతం పెరుగుదలను నమోదు చేయటంతో స్టాక్ ధర ఒక్కోటి రూ.362.85 స్థాయికి చేరుకుంది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ నేడు రూ.1.14 లక్షల కోట్లకు చేరుకుంది. చార్టులలో ఈ స్టాక్ ఓవర్‌సోల్డ్ లేదా ఓవర్‌బాట్ చూపలేదు. గడచిన ఐదేళ్ల కాలంలో టాటా పవర్ స్టాక్ 807 శాతం వృద్ధితో మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. అలాగే గడచిన రెండేళ్లలో స్టాక్ ధర 72 శాతం పెరగగా.. ఆరు నెలల కాలంలో మార్కెట్ల కరెక్షన్ కారణంగా 19 శాతం క్షీణతను నమోదు చేసింది.

ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న తాజా అగ్రిమెంట్ పరిశీలిస్తే.. టాటా గ్రూప్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలతో లేదా లేకుండా సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులతో సహా 7 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించాయి. ఈ మెగా ప్రాజెక్టులో టాటా గ్రూప్ రూ.49 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది.
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీనర్ ఎనర్జీ పాలసీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం 160 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ ద్వారా మెుత్తం రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులతో పాటు దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టి ద్వారా రాష్ట్రానికి మేలు జరగనుంది. తాజా ఒప్పందం ప్రకారం టాటాలకు అవసరమైన పునరుత్పత్తి విద్యుత్ ప్రాజెక్టుల స్థలాల గుర్తింపు, ఫీజిబిలిటీ అధ్యయనాలు అభివృద్ధి పనులను చేపట్టనున్నది. ఈ ప్రాజెక్టుల అభివృద్ధి క్రమంలో న్యూ అండ్ రీన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవసరమైన సహాయాన్ని అందించనుంది. ఇది స్థలాల గుర్తింపు, సైట్ సదుపాయాల ఏర్పాటు, విద్యుత్ అవకాసం నిర్మాణం వంటి సహాయ చర్యలకు బాధ్యత వహిస్తుంది.
ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చడంతో పాటు, స్థానిక సామర్థ్యాభివృద్ధి, నైపుణ్యాల పెంపు, జీవనాధారాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇంత పెద్ద స్థాయి పునరుత్పత్తి విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి, భారతదేశంలోని పర్యావరణ నిబంధనలకి అనుగుణంగా సుస్థిరమైన, గ్రీన్ ఎనర్జీ వనరుల వినియోగాన్ని పెంచడం కోసం కీలకమైంది. దీని ద్వారా పునరుత్పత్తి విద్యుత్ రంగంలో ఏపీ మరో కొత్త దశలోకి అడుగుపెట్టనుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications