Tata Capital IPO: ఇటీవలి కాలంలో పెద్ద కంపెనీల నుంచి ఐపీవోల సంఖ్య దాదాపుగా నిలిచిపోయింది. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో కొత్త ఐపీవోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలోనే టాటా గ్రూప్ ఒక శుభవార్త ప్రకటించింది. త్వరలోనే మరో కొత్త ఐపీవోతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించటంతో ఇన్వెస్టర్లలో కొత్త జోష్ మెుదలైంది.
టాటా గ్రూప్ ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ గతంలో రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు దలాల్ స్ట్రీట్‌లోకి టాటా గ్రూప్ దీనిని ఐపీవోగా ఫ్లోట్ చేయాలని నిర్ణయించింది. పబ్లిక్ ఆఫరింగ్ కోసం కంపెనీ బోర్డు ప్రణాళికలను ఆమోదించిందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించటంతో ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో టాటా గ్రూప్ నుంచి రెండేళ్లలో వస్తున్న రెండవ కంపెనీగా గుర్తింపు పొందింది. దీనికి ముందు 2023లో టాటా టెక్నాలజీస్ కంపెనీ ఐపీవో వచ్చిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి 2004లో టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి టాటా గ్రూప్ నుంచి ఐపీవోలు రావటంతో రిటైల్ ఇన్వెస్టర్లు బెట్ వేయటం ద్వారా షేర్లను దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐపీవోగా వస్తున్న టాటా క్యాపిటల్ సంస్థ తన ఐపీవో ప్రణాళిక ద్వారా స్టాక్ మార్కెట్లో 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని చూస్తోంది. అయితే ఈ షేర్లు పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించబడతాయని తెలుస్తోంది.
ప్రస్తుతం టాటా క్యాపిటల్ కంపెనీలో దాదాపు 93 శాతం వాటాలను మాతృసంస్థ టాటా సన్స్ హోల్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొన్ని నెలల కిందట 'అప్పర్ లేయర్' నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కంపెనీ ఎక్స్ఛేంజీల్లో జాబితా చేయబడాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల రెగ్యులేటరీ సమస్యల కారణంగా తప్పని పరిస్థితుల్లో టాటా క్యాపిటల్ ఐపీవోను టాటా గ్రూప్ ఫ్లోట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో టాటా క్యాపిటల్ బోర్డు ప్రస్తుత వాటాదారులకు రూ.1,504 కోట్ల వరకు విలువైన హక్కుల ఇష్యూను కూడా ఆమోదించింది.
దూసుకుపోతున్న టాటా ఇన్వెస్ట్మెంట్స్..
వాస్తవానికి టాటా క్యాపిటల్ కంపెనీ ఐపీవో మార్కెట్లోకి ఫ్లోట్ చేస్తున్నట్లు వచ్చిన ప్రకటన కారణంగా నేడు ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి కొనుగోలుకు కనిపించిన డిమాండ్ కారణంగా స్టాక్ ధర దాదాపు 8 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications