Tata Chemicals: ఒక్క రోజే 20 శాతం పెరిగిన టాటా కెమికల్ స్టాక్.. ఎందుకంటే..!
కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC)గా తన రిజిస్ట్రేషన్‌ను వదులుకోవడానికి టాటా సన్స్ చేసిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తిరస్కరించిన నేపథ్యంలో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో టాటా కెమికల్స్ లిమిటెడ్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో సహా ఎంపిక చేసిన టాటా గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. టాటా కెమికల్స్ షేర్లు 20 శాతం పెరిగి రూ. 734.50 వద్ద గరిష్ట ధరను తాకగా, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ 15.24 శాతం పెరిగి రూ. 750.30 వద్ద రోజు గరిష్ట స్థాయిని చేరుకుంది. ఈ వార్త రాసే సమయానికి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPV), టాటా స్టీల్ లిమిటెడ్ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌ను లిస్టింగ్ చేసే అవకాశం వల్ల కొన్ని టాటా గ్రూప్ కంపెనీలు ప్రయోజనం పొందవచ్చనే అంచనాల మధ్య ఈ లాభాలు వచ్చాయి. ఆర్‌బిఐ నిర్ణయం టాటా సన్స్ తప్పనిసరి లిస్టింగ్ అంశాన్ని తిరిగి చర్చనీయాంశం చేసింది. టాటా సన్స్ తన సీఐసీ రిజిస్ట్రేషన్‌ను వదులుకోవాలన్న అభ్యర్థనను ఆర్‌బిఐ తిరస్కరించడంతో ఆ కంపెనీ తప్పనిసరిగా పబ్లిక్ లిస్టింగ్ కావాల్సిందేనని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రవి సింగ్ అన్నారు. టాటా సన్స్ ఐపిఓ ద్వారా గణనీయమైన విలువను పొందే అవకాశం ఉందన్నారు. అలాగే షాపూర్జీ పల్లోంజి వంటి వాటాదారులు తమ వాటాను నగదుగా మార్చుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

ఈ పరిణామం ఇప్పటికే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్, టాటా కెమికల్స్‌తో సహా టాటా స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లకు దారితీసిందని వివరించారు. టాటా కెమికల్స్ విషయానికొస్తే సమీప భవిష్యత్తులో రూ. 745 వద్ద ప్రతిఘటన ఉంటుందని సింగ్ అంచనా వేస్తున్నారు. ధర మరింత పెరిగితే నిష్క్రమించాలని ఆయన పెట్టుబడిదారులకు సూచించారు. టాటా కెమికల్స్ రోజువారీ చార్టులలో బుల్లిష్‌గా ఉన్నప్పటికీ ఓవర్‌బాట్ స్థితిలో ఉందని సెబీ-రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ఏఆర్ రామచంద్రన్ అన్నారు.
స్వల్పకాలంలో ఈ స్టాక్ రూ. 780 అప్‌సైడ్ టార్గెట్‌ను చేరుకునే సామర్థ్యం కలిగి ఉందని రవి సింగ్ అన్నారు. రూ. 680-690 వద్ద 'బై-ఆన్-డిప్స్' విధానాన్ని అనుసరించి, రూ. 650 స్టాప్ లాస్‌ను ఆయన సూచించారు.రామచంద్రన్ కూడా రోజువారీ చార్టులలో టాటా ఇన్వెస్ట్‌మెంట్ బుల్లిష్‌గా ఉన్నప్పటికీ, ఓవర్‌బాట్‌గా ఉందని అభివర్ణించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
