Tata Capital IPO: టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) టాటా క్యాపిటల్ బిగ్ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ IPO సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమయ్యే వారంలో రానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా టాటా క్యాపిటల్ దాదాపు రూ. 17,200 కోట్లు (సుమారు 2 బిలియన్ డాలర్లు) సమీకరించనుంది. ఈ ఇష్యూ తరువాత కంపెనీ విలువ దాదాపు 11 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఈ IPO విజయవంతమైతే.. ఇది భారత ఆర్థిక రంగంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డులకెక్కనుంది.
టాటా క్యాపిటల్ IPO మొత్తం 47.58 కోట్ల షేర్లను కలిగి ఉంటుంది. అందులో 21 కోట్ల ఈక్విటీ షేర్లు కొత్తగా జారీ అవుతాయి (Fresh Issue).ఇక 26.58 కోట్ల షేర్లు Offer For Sale - OFS కింద విక్రయానికి వస్తాయి. ఈ సేల్ కింద టాటా సన్స్ 23 కోట్ల షేర్లను విక్రయిస్తుంది.ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC) 3.58 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. ప్రస్తుతం టాటా సన్స్ వద్ద కంపెనీలో 88.6% వాటా ఉంది, IFC వద్ద 1.8 శాతం వాటా ఉంది. IPO అనంతరం ఈ వాటాల్లో కొంత తగ్గుతుంది.

ఈ IPOలో కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా వచ్చే నిధులను కంపెనీ తన Tier-1 క్యాపిటల్ బేస్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంది. అంటే.. రుణాలివ్వడానికి, కొత్త ఆర్థిక ఉత్పత్తులు తీసుకురావడానికి, భవిష్యత్ విస్తరణకు ఇది ఉపయోగపడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. IPO ద్వారా వచ్చిన నిధులు కంపెనీకి వృద్ధికి ఇంధనంగా మారనున్నాయి. టాటా గ్రూప్ తరచుగా IPOలు తీసుకురాదు. ఇటీవల టాటా టెక్నాలజీస్ IPO నవంబర్ 2023లో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మరోసారి టాటా గ్రూప్ కంపెనీ IPO మార్కెట్లోకి వస్తోంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహం పెరిగింది.
టాటా క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY2025 Q1 - ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికం) లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. నికర లాభం విషయానికి వస్తే.. రూ. 472 కోట్ల నుండి రూ. 1040.93 కోట్లకు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. మొత్తం ఆదాయం విషయానికి వస్తే.. గత ఏడాది రూ. 6557.40 కోట్ల నుండి రూ.7691.65 కోట్లకు పెరిగింది. ఈ వృద్ధి టాటా క్యాపిటల్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోందని, ఆర్థికంగా బలపడుతోందని సూచిస్తుంది.
సాధారణంగా IPO అంటే.. ఒక కంపెనీ ప్రజల నుంచి డబ్బు సేకరించడానికి తన వాటాలను (షేర్లను) మార్కెట్లో విక్రయించడం. టాటా క్యాపిటల్ IPO కూడా అలాంటిదే. ఈ IPOలో పెట్టుబడి పెడితే, మీరు కూడా టాటా క్యాపిటల్ షేర్ హోల్డర్ అవుతారు. కంపెనీ లాభాలు పెరిగితే, మీ షేర్ల విలువ కూడా పెరుగుతుంది. టాటా బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం, టాటా క్యాపిటల్ యొక్క ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థిక రంగంలో ఈ IPO పరిమాణం పెద్దదిగా ఉండటం వలన ఇన్వెస్టర్ల దృష్టి మొత్తం రానున్న ఐపీఓ మీదనే ఉంది. ఈ లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications