Crorepati Stock: ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసిన హైదరాబాద్ టెక్ స్టాక్.. మీరూ కొన్నారా?

Multibagger Stock: స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ కొనుగోలు చేయటం కోసం ఇన్వెస్టర్ల వేట కొనసాగుతూనే ఉంటుంది. అయితే వీటిని చాకచక్యంగా గుర్తించటమే అసలైన ట్రిక్. అయితే దీనిని సాధించటం అంత సులువేమీ కాదు. భవిష్యత్తులో మంచి రాబడిని అందించగల సామర్థ్యం కలిగిన స్టాక్స్ తక్కువ రేటులో అందుబాటులో ఉన్నప్పుడే టెక్నికల్స్ పరిశీలించటానికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సేవల కంపెనీ తాన్లా ఫ్లాట్‌ఫారమ్స్ కంపెనీ స్టాక్ గురించే. మంచి రాబడులను పొందటానికి ఇన్వెస్టర్లకు ఉండాల్సిన ముఖ్యమైన అలవాటు దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో పాటు వేచి ఉండే అలవాటు కీలకం. ఈ కంపెనీ కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫారమ్ యాస్ సర్వీస్ వంటి సేవలను అందిస్తోంది. వాస్తవానికి దశాబ్ధకాలానికి కింద కంపెనీ షేర్లు మార్కెట్లో ఒక పెన్నీ స్టాక్ గా ఉన్న సంగతి తెలిసిందే. భారీ ర్యాలీలో కంపెనీ తన దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు 13000 శాతం రాబడిని అందించింది.

Tanla Platforms stock turned one lakh investment into crore in longturn with multibagger gains

11 ఏళ్ల కిందట కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.3.90 ధర వద్ద ఉన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కంపెనీ షేర్లు తన దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు 13340 శాతం రాబడిని అందించి స్టాక్ ధర రూ.524.15కి చేరుకుంది. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు గడచిన 5 ఏళ్ల కాలంలో 550 శాతం రాబడిని అందించింది. గడచిన కొన్ని సంవత్సరాలు కంపెనీ షేర్లు మంచి ర్యాలీని చూడటంతో ఇన్వెస్టర్లు మంచి రాబడులను అందుకున్నారు. ఎవరైనా ఇన్వెస్టర్ 11 ఏళ్ల కిందట కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే దాని విలువ రూ.1.34 కోట్లకు చేరుకుంది.

గడచిన సంవత్సరంలో కంపెనీ షేర్లు 46 శాతం క్షీణతను చూసింది. కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,086.05 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ.515.90 వద్ద ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ 5 ఏళ్ల కిందట కంపెనీ షేర్లలో కనీసం రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.6.5 లక్షలకు చేరుకుంది. సీనియర్ వెటరన్ ఇన్వెస్టర్లు తరచుగా చెప్పినట్లుగానే దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడిపెట్టిన వ్యక్తులు మంచి రాబడులను అందుకోవటం సులువని ఈ స్టాక్ నిరూపించింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+