Tanfak Industries: ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులను చూశాయి. ఈ క్రమంలో ఒకప్పుడు మల్టీబ్యాగర్ స్టాక్స్ కూడా ప్రస్తుతం నష్టాలను చూశాయి. అయితే ఇదే క్రమంలో కొన్ని స్టాక్స్ మాత్రం తమ పెట్టుబడిదారులపై డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం ఒక కంపెనీ షేర్లపై ఎక్కువగా ఉంది.
సరైన పెన్నీ స్టాక్స్ పై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నారు. ఇవి వేలు పెట్టుబడి పెట్టిన వారికి లక్షల్లో రాబడిని అందిస్తుండగా.. లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాన్‌ఫాక్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల గురించే. ఎవరైనా ఇన్వెస్టర్ 11 ఏళ్ల కిందట కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.8 వద్ద ఉన్న సమయంలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు రూ.4 కోట్ల కంటే ఎక్కువకు చేరుకుని ఉండేది. అంటే దీర్ఘకాలం పాటు ఈక్విటీ మార్కెట్లపై పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు ఎలాంటి రాబడులను పొందుతారో ఈ స్టాక్ నిరూపించింది.

21 ఫిబ్రవరి 2014న టాన్‌ఫాక్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.8 వద్ద ఉండేది. కానీ శుక్రవారం కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.3,566 వద్ద తన కొత్త జీవితకాల గరిష్ఠాన్ని చేరుకుంది. దీర్ఘకాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు దాదాపు 445 రెట్లు భారీ రాబడిని అందించింది. అప్పుడు కంపెనీ షేర్లలో లక్ష ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులకు ప్రస్తుతం దాని విలువ రూ.4.45 కోట్లకు చేరుకోవటం గమనార్హం. గత నెలలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.2930 నుంచి ప్రస్తుతం ఉన్న రూ.3566 స్థాయికి ఎగపాకింది.
2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులు ఏకంగా 16 శాతానికి పైగా రాబడిని అందుకున్నారు. అలాగే గడచిన ఆరు నెలల నుంచిటాన్‌ఫాక్ ఇండస్ట్రీస్ షేర్లను హోల్డ్ చేస్తున్న వ్యక్తులు 50 శాతం రాబడిని అందుకోవటం గమనార్హం. అలాగే కంపెనీ షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై ఏడాది కాలంలోనే ఏకంగా 80 శాతం రాబడిని అందుకోవటంతో వారు ప్రస్తుతం పండుగ చేసుకుంటున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications