గంటలో రూ. 9 వేల కోట్లు ఔట్.. స్విగ్గి షేర్లు దారుణ పతనం వెనుక జరిగింది ఇదే..

Swiggy Share Price: దేశీయ ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గీ' (Swiggy) షేర్లు అక్టోబర్ 23 శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఘోరంగా క్రాష్ అయ్యాయి. నగరాల్లో విస్తరిస్తున్న క్విక్ కామర్స్ విభాగం 'ఇన్‌స్టామార్ట్' ఆశించిన రీతిలో రాణించకపోవడం, విభాగం నష్టాలు మూడేళ్ల గరిష్టానికి చేరడం, తీవ్రపోటీ వాతావరణం నెలకొనడంతో ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మకాలకు తెగబడ్డారు. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ. 211.40 వద్ద ముగిసిన ఈ షేరు.. శుక్రవారం ఉదయం రూ. 204.95 వద్ద ప్రారంభమైంది.

ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ తీవ్రమైన ఒత్తిడికి గురై ఉదయం 10:42 గంటల సమయానికి ఏకంగా 15 శాతం పడిపోయి రూ. 191 ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. గతంలో తాకిన రూ. 617.30 రికార్డు ఆల్‌టైమ్ గరిష్ట ధరతో పోలిస్తే ప్రసిద్ధ టెక్ డెలివరీ షేరు సగానికంటే ఎక్కువ క్షీణించి, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను రూ. 53,260 కోట్లకు పడదోసింది. స్విగ్గీ వ్యాపార సామ్రాజ్యంలో రెస్టారెంట్ 'ఫుడ్ డెలివరీ', నిత్యవసరాలను నిమిషాల్లో సరఫరా చేసే 'ఇన్‌స్టామార్ట్' ప్రధాన విభాగాలుగా ఉన్నాయి.

Swiggy Share Price Today Swiggy Stock Crash Swiggy Share Price October 23 Swiggy Instamart Losses Swiggy Q2 Results 2026 Swiggy Market Cap Loss Rs 9000 Crore Wiped Out Instamart Quick Commerce Swiggy Share Fall Reasons Swiggy Stock News Swiggy Share Target Price Swiggy Investors Quick Commerce Competition Swiggy vs Blinkit Swiggy News Telugu 9000

ఇటీవల వెలువడిన సెప్టెంబర్ త్రైమాసిక (Q2) ఆర్థిక ఫలితాలలో ఫుడ్ డెలివరీ బిజినెస్ స్థిరమైన ప్రదర్శన కనబరిచింది. ఈ విభాగపు స్థూల ఆర్డర్ విలువ (GOV) గతేడాదితో పోలిస్తే 18 శాతం పెరగడమే కాకుండా, లాభదాయకత మార్జిన్లు 60 బేసిస్ పాయింట్లు మెరుగుపడి ఒక్కో ఆర్డర్‌పై కంపెనీ మిగులు రాబడిని నమోదు చేసింది. అయితే మార్కెట్ ప్రతికూలతకు ప్రధాన కారణంగా మారిన ఇన్‌స్టామార్ట్ విషయంలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. నికర ఆర్డర్ విలువ (NOV) విశ్లేషకులు అంచనా వేసిన 16 శాతానికి భిన్నంగా కేవలం 13.4 శాతం మాత్రమే పెరిగింది. దీనికి తోడు ఇన్‌స్టామార్ట్ సర్దుబాటు చేసిన ఇబిట్డా (EBITDA) నష్టం త్రైమాసికంలో ఏకంగా రూ. 890 కోట్ల నుండి రూ. 895 కోట్లకు పెరగడం దెబ్బతీసింది.

Also Read

కంపెనీ త్రైమాసిక పనితీరుపై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు భిన్న విశ్లేషణలను వెల్లడించాయి. 'సిటీ' (Citi) స్విగ్గీపై కొనుగోలు (Buy) సిఫార్సును ఉంచినప్పటికీ టార్గెట్ ధరను రూ.330కి తగ్గించగా, 'హెచ్‌ఎస్‌బిసి' (HSBC) ఈ స్టాక్‌కు 'హోల్డ్' రేటింగ్ ఇచ్చి టార్గెట్‌ను రూ. 240కి సవరించింది. బ్లింకిట్, జెప్టోల నుండి ఎదురవుతున్న తీవ్ర పోటీ వల్ల స్విగ్గీ క్విక్ కామర్స్ విభాగం త్వరితగతిన లాభాలను సాధించడం సవాలుగా మారిందని హెచ్‌ఎస్‌బిసి అభిప్రాయపడింది.

'సీఎల్ఎస్ఏ' (CLSA) టార్గెట్‌ను రూ. 262కి తగ్గించి, ఇన్వెస్టర్ల నమ్మకం పుంజుకోవాలంటే రాబోయే త్రైమాసికాల్లో నష్టాలు గణనీయంగా తగ్గాలని స్పష్టం చేసింది. ఇక 'నోమురా' (Nomura) రూ. 300 టార్గెట్‌తో కొనుగోలు సిఫార్సును కొనసాగించినప్పటికీ.. ఇన్‌స్టామార్ట్ నష్టాలు పెరుగుతుండటంతో ప్రస్తుతానికి దాని భవిష్యత్ విలువకు 'సున్నా' ప్రాధాన్యతనిచ్చింది. 'జెఫరీస్' (Jefferies) రూ. 330 లక్ష్యంతో బై రేటింగ్‌ను కొనసాగించింది.

పోటీ ప్రపంచంలో ఆధిపత్యం సాధించేందుకు కొత్త డార్క్ స్టోర్ల ఏర్పాటు, నిరంతర ఆఫర్లు, డిస్కౌంట్ల వల్ల కంపెనీ నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నాయి. రాబోయే త్రైమాసికాలలో ఆర్డర్ల పరిమాణం పెరిగి, ప్రతి ఆర్డర్‌కు అవుతున్న ప్రత్యక్ష నష్టాలు తగ్గితేనే స్విగ్గీ షేరు కోలుకోవడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+