IPO News: త్వరలో తెరచుకోనున్న స్విగ్గీ ఐపీవో.. బెట్టింగ్ కోసం ఎంత డబ్బు కావాలంటే..?

Swiggy IPO: దేశంలో చిన్నపెద్ద అని తేడా లేకుండా కంపెనీలు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి ఐపీవోలు లాంచ్ చేస్తున్నాయి. దీనికి తగినట్లుగానే ఇన్వెస్టర్లు భారీగా డబ్బును కుమ్మరిస్తూ ఐపీవోలపై పందెం వేస్తున్నారు. చాలా మంది లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇలా చేస్తుండగా.. మరికొందరు మాత్రం దీర్ఘకాలిక వ్యూహాలతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పైగా ఈక్విటీ మార్కెట్లు ఓలటాలిటీలో ఉండటంతో చాలా మంది ఐపీవోలపై ఎక్కువగా బెట్టింగ్ వేసేందుకు ఇష్టపడుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫుడ్ డెలివరీ స్టార్టప్ అగ్రిగేటర్ స్విగ్గీ ఐపీవో గురించే. దాదాపు ఏదాదికి పైగా కాలం నుంచి ఈ కంపెనీ ఐపీవో లాంట్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఇప్పటి వరకు అది వాయిదా పడుతూ వచ్చింది. స్విగ్గీ పోటీదారు జొమాటో కరోనా సమయంలోనే జాబితా అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కంపెనీ ఓవర్ వాల్యుయేషన్లకు వచ్చిందని స్టాక్ ధర క్షీణతను చూసింది. అయితే ఇటీవలి కాలంలో జొమాటో త్రైమాసిక ఫలితాలను చూస్తుంటే లాభదాయకమైన కంపెనీగా మారుతుండటం ఇన్వెస్టర్లకు స్టార్టప్ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తోంది.

Swiggy IPO to open for subscription from November 6 Know price band too

ప్రస్తుతం స్విగ్గీ ఐపీవో దీపావళి తర్వాత బెట్టింగ్ వేసేవారికోసం తెరచుకోనుంది. నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు సబ్‌స్క్రైబర్ల కోసం ఇష్యూ అందుబాటులో ఉంటుంది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కరోజు ముందుగా అంటే నవంబర్ 5న ఐపీవో అందుబాటులోకి వస్తోంది. స్టార్టప్ కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.11,300 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.371-390గా నిర్ణయించింది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవోలో రూ.4499 కోట్ల తాజా ఇష్యూ ఉండగా మిగిలిన రూ.6828.43 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబడుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో నవంబర్ 13న మార్కెట్లలో లిస్టింగ్ కోసం అడుగుపెట్టనుందని తెలుస్తోంది.

కంపెనీ తాజా ఐపీవోలో ఉద్యోగుల కోసం 10 శాతం షేర్లను రిజర్వు చేసింది. పైగా ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.25 డిస్కౌంట్ రేటుకు విక్రయించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ 2014లో స్థాపించబడిన కంపెనీ. అయితే ప్రస్తుతం కంపెనీ క్విక్ కామర్స్ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టిన వేళ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, కిరాణాతో పాటుగా ఇతర గృహోపకరణాలను అందిస్తుంది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ లిమిటెడ్ ఆదాయం 34% పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ నష్టం రూ.4,179.31 కోట్ల నుంచి రూ.2,350.24 కోట్లకు తగ్గింది.

Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+