Swiggy IPO: మార్కెట్ల పనితీరుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఐపీవోల కోలాహలం చాలా గ్యాప్ తర్వాత తిరిగి స్టార్ట్ అయింది. ఈ క్రమంలో రిటైల్ పెట్టుబడిదారులతో పాటు కంపెనీలోని ఉద్యోగులకు సైతం అదృష్టం పట్టింది. దీంతో చాలా మంది ప్రస్తుతం తొలిరోజు లాభాలతో పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్విగ్గీ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లాభాలతో బంపర్ లిస్టింగ్ నమోదు చేశాయి. తొలిరోజున మార్కెట్లలో అడుగుపెడుతూ మంచి ప్రారంభాన్ని స్విగ్గీ షేర్లు చూశాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.412 రేటు వద్ద జాబితా కాగా.. బీఎస్ఈలో స్టాక్ ఒక్కోటి రూ.390 రేటు వద్ద జాబితా అయ్యాయి. వాస్తవానికి నేడు దేశీయ స్టాక్ మార్కట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఐపీవో షేర్లు బలమైన అరంగేట్రం చేయంతో మార్కెట్లలో కోలాహలం కొనసాగుతోంది. వాస్తవానికి నేడు నిఫ్టీ-సెన్సెక్స్ తమ మూడునెలల కనిష్ఠానికి దిగజారాయి. ద్రవ్యోల్బణం పెరగటంతో పాటు ఆటో, మెటల్ రంగాల షేర్లు భారీ నష్టాలను చూడటం దీనికి కారణంగా ఉంది.

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లోకి స్విగ్గీ కంపెనీ షేర్లు లిస్టింగ్ దాదాపు 500 మంది ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చేసింది. కంపెనీతో అనేక సంవత్సరాలుగా అనుబంధం కలిగి వ్యాపారాన్ని స్కేల్ చేసిన 5,000 మంది సిబ్బంది చేతుల్లో రూ.9,000 కోట్లను ఉంచడానికి సిద్ధంగా ఉంది. స్విగ్గీ ESOP భారతదేశంలోని స్టార్టప్ సీన్‌లో అగ్రస్థానంలో ఉండనుంది. స్విగ్గీకి ముందు ఇదే తరహా కసరత్తును ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ చెల్లింపులలో కంపెనీ ఇటీవల 17,000 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు జూలై 2023లో రూ.5,800 కోట్లు చెల్లించింది. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఉన్న జొమాటో సైతం ఇప్పటి వరకు దాదాపు రూ.7 వేల కోట్ల ESOP పూల్‌ను కలిగి ఉంది. అలాగే తన ఐపీవో సమయంలో ఉద్యోగులకు సంపదను సృష్టించింది.
స్విగ్గీ ఐపీవో నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు సబ్‌స్క్రైబర్ల కోసం ఇష్యూ అందుబాటులో ఉంటుంది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కరోజు ముందుగా అంటే నవంబర్ 5న ఐపీవో అందుబాటులోకి వస్తోంది. స్టార్టప్ కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.11,300 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.371-390గా నిర్ణయించింది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవోలో రూ.4499 కోట్ల తాజా ఇష్యూ ఉండగా మిగిలిన రూ.6828.43 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబడుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో నవంబర్ 13న మార్కెట్లలో లిస్టింగ్ కోసం అడుగుపెట్టనుందని తెలుస్తోంది.
కంపెనీ తాజా ఐపీవోలో ఉద్యోగుల కోసం 10 శాతం షేర్లను రిజర్వు చేసింది. పైగా ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.25 డిస్కౌంట్ రేటుకు విక్రయించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ 2014లో స్థాపించబడిన కంపెనీ. అయితే ప్రస్తుతం కంపెనీ క్విక్ కామర్స్ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టిన వేళ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, కిరాణాతో పాటుగా ఇతర గృహోపకరణాలను అందిస్తుంది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ లిమిటెడ్ ఆదాయం 34% పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ నష్టం రూ.4,179.31 కోట్ల నుంచి రూ.2,350.24 కోట్లకు తగ్గింది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications