Suzlon Energy Shares: తక్కువ బడ్డెట్ ఉండే వ్యక్తులు ఎప్పుడూ తక్కువ రేటులో అందుబాటులో ఉంటే షేర్లపై ఫోకస్ పెడుతుంటారు. ఈ క్రమంలో మార్కెట్లో గడచిన కొన్ని నెలలుగా ఫోకస్ లో ఉన్న సుజ్లాన్ కంపెనీ షేర్లపై చాలా మంది పెట్టుబడిదారుల దృష్టి కొనసాగుతోంది. దీర్ఘకాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ కింగ్ కానుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆకాంక్షిస్తున్న వేళ చాలా మంది విండ్, సోలార్ కంపెనీల షేర్లపై భారీగా బెట్టింగ్ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఒక్కోటి రూ.66.12 స్థాయి వద్ద ఎన్ఎస్ఈలో ప్రయాణాన్ని ముగించాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.91,140 కోట్లకు చేరుకుంది. అయితే భారత స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ఒడిదొడుకులతో పాటు అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్ రెన్యూవబుల్ ఎనర్జీకి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రంగంలోని అనేక కంపెనీల షేర్లు కొంత కుదుపుకు గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం స్టాక్ ఈ షాక్ నుంచి తిరిగి తేరుకుని వేగంగా దూసుకుపోవటం ప్రారంభించింది.

గడచిన గత ఐదు రోజుల్లో సుజ్లాన్ ఎనర్జీ షేరు 2.72% పడిపోయింది. గత నెలలో షేరు 0.30% క్షీణతను చూసింది. సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 6 నెలల్లో 32.24% రాబడిని అందించగా.. 2024లో ఇప్పటి వరకు పెట్టుబడిదారులు 72 శాతం మేర రాబడిని అందుకున్నారు. ఇక దీర్ఘకాలం విషయానికి వస్తే ఐదేళ్లలో ఈ ఎనర్జీ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 3173 శాతం భారీ రాబడిని అందించి మల్టీబ్యాగర్ గెయిన్స్ తెచ్చిపెట్టింది.
బ్రోకరేజీల మాట ఇదే..
ఈ తరుణంలో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తన అంచనాలను వెల్లడించింది. ముందుగా రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ షేర్లకు BUY రేటింగ్ అందిస్తూ ఒక్కో షేరుకు టార్గెట్ ధరను రూ.81గా ఫిక్స్ చేసింది. సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ తన వృద్ధి సామర్థ్యంపై మార్కెట్లకు ఇన్వెస్టర్లకు ఆశాజనక సంకేతాలను పంపుతోందని బ్రోకరేజ్ వెల్లడించింది. వ్యాపార వృద్ధి, భౌగోళిక విస్తరణ కోసం సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ సానుకూల చర్యలు తీసుకుంటోందని బ్రోకరేజ్ వెల్లడించింది. ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీ కోసం కొనసాగుతున్న బూమ్ రానున్న 3-4 ఏళ్ల పాటు కొనసాగుతుందని ఇంధన రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
దేశీయ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ కంపెనీ షేర్లకు BUY రేటింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు రూ.68 టార్గెట్ ధరను అందించింది. మరో బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ సుజ్లాన్ ఎనర్జీ షేర్లకు టార్గెట్ ధరను గతంలో అందించిన రూ.70 నుంచి ప్రస్తుతం రూ.75కి పెంచింది. అలాగే ఛాయిస్ బ్రోకింగ్ కంపెనీ సైతం ప్రస్తుత ధరలు షేర్ల కొనుగోలుకు అనుకూలమైనదిగా పేర్కొంది. ఒకవేళ స్టా ధర సపోర్ట్ లెవల్ కిందకు జారితే మరింతగా దిగజారే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో టార్గెట్ ధరను రూ.66-70గా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications