Multibagger Stock: ఒక సంవత్సరంలో 683 శాతం పెరిగిన స్టాక్ ఇదే..!
పునరుత్పాదక ఇంధన సంస్థ సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర శుక్రవారం పెరిగింది. కంపెనీ కొత్తగా 5.0 మెగావాట్ల విండ్ టర్బైన్ అర్డర్ దక్కించుకుంది. దీంతో కంపెనీ షేరు పాజిటివ్ లో ట్రేడవుతోంది. S175ను ప్రారంభించిన కేవలం రెండు వారాలకే, 105 మెగావాట్ల విలువైన ఈ ఆర్డర్‌ను సన్‌ష్యూర్ ఎనర్జీ ఇచ్చింది. కంపెనీ ప్రకటన తర్వాత, బీఎస్ఈలో స్టాక్ 1.7% పెరిగి, రోజులో అత్యధికంగా రూ.58.15కు చేరుకుంది. ఈ స్టాక్ గత మూడు నెలల్లో 45 శాతం పెరగ్గా.. 6 నెలల్లో 10 పెరిగింది. అయితే గతేడాది 15 శాతంనష్టపోయింది. అయితే ఈ స్టాక్ దీర్ఘకాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది.
సుజ్లాన్ షేర ధర ఐదు సంవత్సరాలలో 683 శాతం పెరిగింది. ఈ స్టాక్ 2025 జూలైలో రూ.68.30 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే ఈ సంవత్సరం అంటే 2026 మార్చిలో రూ.38.17 వద్ద కనిష్ఠా స్థాయికి చేరుకుంది. ఇప్పుడు స్టాక్ మళ్లీ పెరుగుతూ వస్తోంది. తాజాగా కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో సుజ్లాన్ సంస్థ తన S175 (5.0 MW) విండ్ టర్బైన్ జనరేటర్ల 21 యూనిట్లను ఏర్పాటు చేసింది. 175-మీటర్ల రూటర్, 160-మీటర్ల హైబ్రిడ్ లాటిస్ టవర్‌తో పనిచేసే ఈ టర్బైన్‌ను, మరింత బలమైన, స్థిరమైన పవన ప్రవాహాలను అందిపుచ్చుకునేలా తయారు చేశారు.

ఈ ఉత్పత్తిని ప్రారంభించిన కొన్ని వారాలకే ఈ ఆర్డర్ రావడంతో స్టాక్ పాజిటివ్గా స్పందించింది. భారతదేశంలో పవన విద్యుత్ ప్రాజెక్టుల కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. పునరుత్పాదక విద్యుత్‌కు మద్దతు ఇవ్వడానికి S175ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. దేశంలో వేగవంతమైన విద్యుదీకరణ, డేటా సెంటర్లు, జీసీసీలు, అధునాతన తయారీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. స్వచ్ఛ ఇంధన అవసరాన్ని తీర్చడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
14 నెలల వ్యవధిలో సన్ ష్యూర్ ఎనర్జీతో కలిసి 400.8 మెగావాట్లా విద్యుత్ ను అభివృద్ధి చేసినట్లు సుజ్లాన్ సీఈఓ అజయ్ కపూర్ తెలిపారు. 2030 నాటికి 10 గిగావాట్ల ప్లాట్‌ఫామ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సుజ్లాన్ కంపెనీకి మూడు దశాబ్దాల అనుభవం ఉందని వివరించారు. కాగా 2023 మార్చిలో సుజ్లాన్ షేర్ ప్రైస్ రూ.8 గా ఉండేది. 2024 సెప్టెంబర్ కల్లా షేర్ ధర రూ. 83.45 లకు పెరిగింది. ఒక సంవత్సరంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత షేర్ ప్రైస్ తగ్గింది. ప్రస్తుతం రూ.57 నుంచి రూ.58 వద్ద ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications