Suzlon Stock: ప్రమాదంలో సుజ్లాన్ ఇన్వెస్టర్స్.. షేర్లను ఉంచుకోవాలా? అమ్మాలా? బ్రోకరేజీలు..
Suzlon Energy Shares: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో సంచనాలు సృష్టించిన షేర్లలో సుజ్లాన్ ఎనర్జీ కంపెనీనే. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ ఎనర్జీ ఎంపికలవైపుకు మరులుతున్న వేళ సుజ్లాన్ వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. కంపెనీ ఇటీవలి కాలంలో మంచి ఆర్డర్ బుక్ సంపాదించింది. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్ల వెనుక పరగెట్టి దాని విలువను భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లోనూ సుజ్లాన్ కంపెనీ షేర్ల పతనం కొనసాగింది. దీంతో గడచిన ఐదు రోజుల్లో స్టాక్ దాదాపు 20 శాతం విలువను కోల్పోయింది. నేడు ఇంట్రాడేలో సుజ్లాన్ స్టాక్ ధర 9.26 శాతం క్షీణించి రూ.53.45 స్థాయికి చేరుకుంది. అయితే మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ధర 9 శాతం పతనంతో రూ.54.03 వద్ద ప్రయాణాన్ని ముగించింది. సుజ్లాన్ స్టాక్ ఇప్పటికీ ప్రీమియం వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతోందని nvest4edu రీసెర్చ్ & ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్, ఆదిత్య అగర్వాలా పేర్కొన్నారు.

దీనికి తోడు ప్రధానంగా అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో ప్రపంచ వ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ ప్రభావాన్ని చూస్తున్నాయి. ప్రధానంగా భారతదేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ ఆ వేడిని చూస్తున్నాయి. ప్రతికూల సెంటిమెంట్లలో సోలార్ ఎనర్జీ స్టాక్స్, విండ్ ఎనర్జీ కంపెనీల షేర్లు వరుసగా కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి పనాన్ని చూస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు సోలార్ మాడ్యూల్ ఎగుమతులు, పర్యావరణ అనుకూల దిగుమతుల కోసం డిమాండ్‌ను పరిమితం చేయడానికి ట్రంప్ నిర్ణయిస్తే భవిష్యత్తులో అనిశ్చితి పెరుగుతుంది. వాస్తవానికి ట్రంప్ గ్రాండ్ విక్టరీ తర్వాత తన తొలి ప్రసంగంలో పునరుత్పాదక ప్రాజెక్ట్‌లను నిలిపివేస్తానని ప్రకటించటంతో రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ పతనం కొనసాగుతోంది. దీంతో ఇండియా నుంచి ఎగుమతులు తగ్గుతాయని తద్వారా అమెరికాకు ఎగుమతులపే అధారపడే కంపెనీలు పెద్ద ఎదురుదెబ్బను చూస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ చర్యలతో నష్టపోయే స్టాక్స్ లిస్ట్ పరిశీలిస్తే టాటా పవర్, వారీ ఎనర్జీస్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్, ఇన్సోలేషన్ ఎనర్జీ, వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్స్ సోలార్ ఎనర్జీ రంగం నుంచి ముందు వరుసలో ఉన్నాయి. ఇదే క్రమంలో విండ్ ఎనర్జీ రంగంలో సుజ్లాన్, ఐనాక్స్ విండ్, అదానీ గ్రీన్, కేపీ ఎనర్జీ, కేపీఐ ఎనర్జీ, ఓరియంగ్ గ్రీన్ పవర్ సహా మరిన్ని కంపెనీల షేర్లు ప్రభావితం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సుజ్లాన్ షేర్లపై బ్రోకరేజీల మాట..?
ఇన్వెస్టర్లు ప్రస్తుత సమయంలో సుజ్లాన్ షేర్లను కొత్తగా కొనుగోలు చేయటానికి లేదా ప్రస్తుతం ఉన్న పెట్టుబడులను యావరేజ్ చేయటానికి ఎలాంటి కొనుగోళ్లు చేపట్టొద్దని ఆదిత్య అగర్వాలా సూచిస్తున్నారు. స్టాక్ ధర పతనం కొనసాగి చివరికి రూ.50 రేటు వద్ద స్థిరపడవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి స్టాక్ ధర స్థిరపడ్డాక మళ్లీ కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సుజ్లాన్ స్టాక్ కొనుగోలు చేయటం ఉత్తమంగా ఆయన వెల్లడించారు. ఒక్కో షేరు వేగంగా రూ.100 స్థాయికి చేరుకుంటుందని తాను భావించటం లేదని అయితే రూ.80-85 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో స్టాక్ బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ కుషల్ గాంధీ మాట్లాడుతూ ప్రస్తుత విలువల వద్ద మార్కెట్లో సుజ్లాన్ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలని తాము సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2024 నాటికి కంపెనీలో ప్రమోటర్ల వాటా స్వల్పంగా తగ్గి 13.25 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications