Suzlon Stock: తిరిగి ట్రాక్‌లోకి సుజ్లాన్ స్టాక్.. 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్.. ఆ మార్పే కారణం!
Suzlon Energy Shares: విండ్ ఎనర్జీ రంగంలో సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ లీడింగ్ ఆటగాడు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కంపెనీ పెద్ద ఆటగాళ్లలో ఒకటిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గడచిన 5 ట్రేడింగ్ సేషన్లలో దాదాపు 22 శాతం నష్టపోయిన కంపెనీ షేర్లు నేడు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది.
ఇప్పుడు చాలా మందిలో కంపెనీ షేర్లపై పెద్ద అనుమానాలు ఉన్నాయి. ఈ రెన్యూవబుల్ స్టాక్ షేర్లను కొనుగోలు చేయాలా లేక అమ్మేయాలా అనే గందరగోళంలో చాలా మంది ఇన్వెస్టర్లు చిక్కుకున్నారు. ఈ క్రమంలో బ్రోకరేజీలు ఏమంటున్నాయో పరిశీలిస్తే జేఎం ఫైనాన్షియల్ సుజ్లాన్ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించగా.. ఇదే క్రమంలో వెంచురా సెక్యూరిటీస్ మాత్రం సెల్ రేటింగ్ అందించింది. ఈ క్రమంలో బ్రోకరేజ్ జేఎం ఫైనాన్షియల్ కంపెనీ షేర్లకు ఒక్కోటి రూ.81 టార్గెట్ ధరను ప్రకటించింది. ఇదే క్రమంలో మరో బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెల్ రేటింగ్ అందిస్టూ టార్గెట్ ధరను రూ.50గా అందించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు దాదాపు రూ.69 రేటు వద్ద మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

సుజ్లాన్ కంపెనీ రానున్న 3-4 ఏళ్ల కాలానికి సరిపడా డిమాండ్ కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీ తన కస్టమర్లకు విండ్ ఎనర్జీ రంగంలో పూర్తి అవసరాలను తీర్చుతోంది. సుజ్లాన్-ఐనాక్స్ విండ్ ఈ రంగంలో అగ్రగామి ఆటగాళ్లుగా ఉన్నందున పెట్టుబడిదారులు చాలా కాలంగా ఈ రెండు కంపెనీలపై బెట్టింగ్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లపై ఫోకస్ పెంచి తమ పెట్టుబడులను పెంచుకున్నట్లు తేలింది. తాజాగా కంపెనీ షేర్లు తిరిగి గాడినపడటానికి షేర్లు ఊపందుకోవటానికి వెనుక ఒక కారణం ఉంది. అదే కంపెనీ ఉన్నత స్థాయి మేనేమ్మెంట్‌లో జరిగిన మార్పులు.
సుజ్లాన్ కంపెనీ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు బలంగా ఉన్నప్పటికీ.. కంపెనీ ఇటీవలే దాని నిర్వహణలో మార్పులను చూసింది. కంపెనీకి 28 ఏళ్లపాటు సేవలందించిన సుదీర్ఘ కాలం సీఈవో ఈశ్వరచంద్ మంగళ్ పదవి నుంచి తప్పుకున్నారు. సుజ్లాన్ ఏకీకృత నికర లాభంలో 95.72% పెరుగుదలను చూసింది. 8 నవంబర్ 2024న పని వేళల ముగింపు నుండి కంపెనీ సేవలకు రాజీనామా చేశారు. ప్రధానంగా అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో ప్రపంచ వ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ ప్రభావాన్ని చూస్తుందనే ఆందోళనల మధ్య కంపెనీ ఉన్నతస్థాయి యాజమాన్యంలో మార్పులు వస్తున్నాయి. రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.200.20 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం కేవలం రూ.102.29 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 47.68% పెరిగి రూ.2,092.99 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications