Suzlon Energy Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్లప్పుడూ పెన్నీ స్టాక్స్ కోసం ఇన్వెస్టర్ల వేట కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎక్కువ మంది ప్రస్తుతం కొనుగోలుకు మెుగ్గుచూపుతున్న షేర్లలో సుజ్లాన్ కూడా ఒకటి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంపై ప్రపంచ వ్యాప్తంగా దృష్టి పెరిగిన క్రమంలో కంపెనీ కొన్నాళ్లుగా మంచి వ్యాపారాన్ని పొందటమే దీనికి కారణం. అయితే కంపెనీ మరోసారి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ పేరు వార్తల్లో నిలవటానికి కారణం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ నుంచి పెనాల్టీకి సంబంధించిన నోటీసులు రావటమే. 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు పూర్తి చేసిన ఎగుమతుల కోసం ఎంపిక చేసిన ఎగుమతి ఆదాయాన్ని ఆలస్యం చేయడంపై తాజాగా ఈడీ నుంచి పెనాల్టీ ఆర్డర్‌ను అందుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదారాబాద్ ఈడీ కార్యాలయం నుంచి దీనికి సంబంధించి కంపెనీపై రూ.20 లక్షల జరిమానా విధించబడిందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మంగళవారం వెల్లడించింది. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి ప్రస్తుతం ఫుల్‍స్టాప్ పడిందని కంపెనీ వెల్లడించింది.

మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్లు స్వల్పంగా నష్టంతో ఒక్కోటి రూ.64.82 వద్ద క్లోజ్ అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు తన ఇన్వెస్టర్లకు 68.45 శాతం రాబడిని అందించింది. భవిష్యత్తులో 2-3 ఏళ్ల పాటు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో బూమ్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మరోపక్క అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపడుతున్న వేళ ఈ రంగంపై కొంత అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి.
పెట్టుబడుల విషయంలో అధిక రిస్క్ అపటైట్ కలిగిన పెట్టుబడిదారులు సుజ్లాన్ ఎనర్జీ షేర్లను కొనుగోలు చేయవచ్చని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్‌లోని ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని వెల్లడించారు. కంపెనీ గతంలో కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలను ఎదుర్కోగా ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లపై పెట్టుబడిదారులు బై ఎట్ డిప్స్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని సూచించారు. అంటే షేర్ ధర తగ్గిన ప్రతిసారి కొత్తగా పెట్టుబడి పెట్టి స్టాక్స్ కొనుగోలు చేసేందుకు అనుకూలమైన పరిస్థితులుగా ఇన్వెస్టర్లు భావించవచ్చని క్రాంతి పేర్కొన్నారు. అలాగే టెక్నికల్స్ ప్రకారం కంపెనీ షేర్లకు 66-63 సపోర్ట్ జోన్ గా నిలుస్తుందని తెలిపారు.
సమీప-కాలంలో స్టాక్ రూ.70 ధర వద్ద ప్రతిఘటనను చూడొచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్ రీసెర్చ్) రవి సింగ్ పేర్కొన్నారు. దీని తర్వాత కంపెనీ షేర్లు తదుపరి ర్యాలీని చూస్తాయన్నారు. ఇదే క్రమంలో సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ఏఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ స్టాక్ సమీపకాలంలో రూ.78 రేటును చేరుకోవచ్చని తన అంచనాలను పంచుకున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications