Suzlon Energy Stock: దేశీయంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో అపారమైన అవకాశాలు రోజురోజుకూ పెరగటం సుజ్లాన్ కంపెనీకి మంచి రోజులు తీసుకొచ్చింది. దేశీయంగా కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలతో అనేక పవర్ కంపెనీలు ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ థర్మల్ ప్రాంట్లతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీలోకి అడుగుపెడుతున్నాయి. కంపెనీ దినదినాభివృద్ధి చెందుతున్నట్లు వార్షిక ఫలితాలను చూస్తుంటే తెలుస్తోంది.
తాజాగా సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 96 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఫలితాల ప్రకటన తర్వాత ఇంట్రాడేలో కంపెనీ షేర్లు దాదాపు 4 శాతం పెరుగుదలను చూశాయి. అయితే నేడు మార్కెట్లు భారీగా ఓలటాలిటీలో కనసాగుతున్న వేళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో 4.23 శాతం నష్టతో రూ.76.72 వద్ద ట్రేడింగ్ కనసాగిస్తున్నాయి.

జూలై-సెప్టెంబర్ మధ్య త్రైమాసిక కాలంలో కంపెనీ లాభం రూ.200.20 కోట్లకు చేరుకుంది. అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2092.99 కోట్లుగా ఉంది. గడచిన ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.102.29 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గత ఏడాది ఆదాయం రూ.1417.21 కోట్లుగా ఉంది. అంటే వార్షిక ప్రాతిపదికన కంపెనీ లాభాలో దాదాపు 96 శాతం వృద్ధిని సాధించటంతో పాటు ఆదాయం 47.68 శాతం పెరగటంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్రైమాసిక ప్రాతిపదికన మాత్రం కంపెనీ నికర లాభం క్యూతో పోల్చితే 34 శాతం క్షీణతను చూసింది.
ఇక కంపెనీ మంచి ఆర్డర్ పైప్ లైన్ కలిగి ఉండటం భవిష్యత్తు గ్రోత్ పై ఆశావాదాన్ని క్రియేట్ చేస్తోంది. రెండవ త్రైమాసికంలో సుజ్లాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ సబ్సిడరీ కంపెనీ NTPC గ్రీన్ ఎనర్జీతో 1166 MW విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. వాస్తవానికి దేశంలో జరిగిన విండ్ ఎనర్జీ డీల్స్‌లో ఇది అతిపెద్దది కావటం గమనార్హం. ఈ ఒప్పందంలో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం 2 ప్రాజెక్ట్‌లు, ఇండియన్ ఆయిల్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఒక ప్రాజెక్ట్ ఉన్నాయి. ఈ క్రమంలో బ్రోకరేజ్ అభిప్రాయాన్ని కంపెనీ షేర్లపై గమనిస్తే నువామా టార్గెట్ ధరను రూ.67గా నిర్ణయించింది.
ప్రధాన వ్యాపారం ఇప్పుడు మార్కెట్ ఊపందుకున్నందుకు బలమైన పునాదిపై కొనసాగుతోందని సుజ్లాన్ గ్రూప్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి పేర్కొన్నారు. కొత్త ఉత్పత్తి సమర్పణను స్థిరీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. బలమైన ఆర్డర్ బుక్ తో పాటు వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా కొత్త అవకాశాలను అన్వేషించే అవకాశాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. జిందాల్, ఎన్టీపీసీ వంటి క్లయింట్లతో వృద్ధిని కొనసాగిస్తున్నట్లు సుజ్లాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ JP చలసాని వెల్లడించారు. భవిష్యత్తు కోసం తాము స్థిరమైన వృద్ధి, విజయానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications