మార్చిలో పాతాళానికి.. ఇప్పుడు ఆకాశానికి! అంచనాలు పెంచేస్తున్న మల్టీబ్యాగర్ స్టాక్!

మీరు స్టాక్ మార్కెట్ (stock market) లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీకు 'సుజ్లాన్ ఎనర్జీ' (Suzlon Energy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా నమ్మే ఈ విండ్ ఎనర్జీ కంపెనీ షేర్లు గత కొద్దిరోజులుగా మార్కెట్‌ లో హాట్ టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా విపరీతమైన సెల్లింగ్ ప్రెజర్‌తో కుదేలైన ఈ మల్టీబ్యాగర్ స్టాక్, ఇప్పుడు ఫీనిక్స్ పక్షిలా లేచింది. మొన్నటి మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా రూ. 40 కంటే కిందకు పడిపోయిన ఈ షేరు ధర.. ఇప్పుడు ఏకంగా 50.6% రికవరీ సాధించి రూ. 57.53 వద్ద క్లోజ్ అయింది. ఇది గత ఐదు నెలల్లోనే అత్యధిక స్థాయి కావడం విశేషం!

Suzlon Energy Multibagger Stock Jumps 50 Percent Hits Five Month High Stock Market

గ్లోబల్ టెన్షన్స్.. గ్రీన్ ఎనర్జీకి ప్లస్ పాయింట్!

అసలు పడిపోతున్న ఈ కంపెనీకి హఠాత్తుగా ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న గొడవలు, ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న పవర్ డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్ల చూపు మళ్లీ గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ వైపు మళ్లింది. దీనికి తోడు మన దేశంలో పీక్ టైంలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కరెంట్ డిమాండ్ పెరిగినప్పుడు పవన విద్యుత్ (Wind Power) బాగా ఉపయోగపడుతోంది. అందుకే పాలసీ మేకర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా విండ్ ఎనర్జీ వైపు మొగ్గు చూపుతున్నాయి. గ్రిడ్ కనెక్టివిటీ సమస్యలను పక్కనబెట్టి ఈ రంగం ఇప్పుడు దూసుకుపోతోంది.

అదిరిపోయే ఆర్డర్ బుక్.. పెరిగిన ఆదాయం!

మార్చి త్రైమాసికం (Q4 FY26) లో సుజ్లాన్ ఎనర్జీ ఆశించిన దానికంటే మంచి ఫలితాలను సాధించడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీపై నమ్మకాన్ని పెంచుకున్నాయి. ప్రస్తుతం సుజ్లాన్ ఎనర్జీ చేతిలో ఏకంగా 5,892 మెగావాట్ల (MW) భారీ ఆర్డర్ బుక్ ఉంది. ఇటీవలే సన్‌సూర్ ఎనర్జీ నుండి 195 మెగావాట్ల ఆర్డర్ కూడా లభించింది.

గత ఏడాది క్యూ4 తో పోలిస్తే ఈసారి కంపెనీ రెవెన్యూ 45% పెరిగి రూ. 5,494 కోట్లకు చేరింది. ఎబిటా (EBITDA) కూడా 39.1% వృద్ధితో రూ. 964 కోట్లకు పెరిగింది. అయితే నికర లాభం మాత్రం స్వల్పంగా 5.7% తగ్గి రూ. 1,181 కోట్లుగా నమోదైంది. అయినప్పటికీ, విండ్ టర్బైన్ల డెలివరీలు వేగవంతం కావడం కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది.

షేర్ ధర రూ. 71 వరకు వెళ్తుందా? నిపుణుల అంచనాలు!

సుజ్లాన్ ఎనర్జీ గ్రోత్ చూసి దేశీయ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్ మార్కెట్ (stock market) ఇన్వెస్ట్‌మెంట్‌పై చాలా పాజిటివ్‌ గా ఉన్నాయి.

  • ఆనంద్ రాఠీ (Anand Rathi): ఈ స్టాక్‌కు 'Buy' రేటింగ్ ఇస్తూ.. టార్గెట్ ప్రైస్ రూ. 60 గా నిర్ణయించింది.
  • జేఎమ్ ఫైనాన్షియల్ (JM Financial): కంపెనీకున్న 5.9 గిగావాట్ల ఆర్డర్ బుక్ చూసి, తమ టార్గెట్ ధరను రూ. 64 నుండి రూ. 65 కి పెంచింది.
  • సిస్టమాటిక్స్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ (Systematix): సుజ్లాన్ కంపెనీ లీడర్‌షిప్, సరికొత్త హైబ్రిడ్ ప్రాజెక్టుల స్ట్రాటజీని మెచ్చుకుంటూ ఈ షేరు ఏకంగా రూ. 71 వరకు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మొత్తానికి చూస్తే ఒకప్పుడు నష్టాల్లో మునిగిపోయిన సుజ్లాన్ ఎనర్జీ.. ఇప్పుడు అప్పులన్నీ తీర్చేసి, చేతిలో నిండుగా ఆర్డర్లతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచుతోంది. అయితే షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం మాత్రం మర్చిపోకండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+