Supreme Facility IPO: గడచిన మూడు వారాలుగా ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న ఇన్వెస్టర్లు భారీగా లాభాలను చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఊహించని ప్రళయం లాంటి ఐపీవో ఒకటి నేడు ఇన్వెస్టర్లను డిస్కౌంటెడ్ లిస్టింగ్ రూపంలో నిరాశకు గురిచేసింది. పైగా నష్టాల జాబితా తర్వాత ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను విక్రయించేందుకు మెుగ్గుచూపటంతో పరిస్థితి మరింతగా దిగజారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు దాదాపు 5 కంపెనీల ఐపీవోలు జాబితా కాగా మనం మాట్లాడుకుంటున్న ఐపీవో మాత్రం నిరాశనే మిగిల్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు లిస్ట్ అయిన సుప్రీం ఫెసిలిటీ మేజేన్మెంట్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు వాస్తవ ఇష్యూ గరిష్ఠ ధర రూ.76 కంటే 1.32 శాతం తక్కువగా రూ.75 వద్ద మార్కెట్లోకి అరంగేట్రం చేశాయి. అయితే డిస్కౌంటెడ్ లిస్టింగ్ తర్వాత కూడా నష్టాలు ఇన్వెస్టర్లను వేటాడాయి. దీంతో లిస్టింగ్ తర్వాత అమ్మకాల ఒత్తిడి షేర్లలో కొనసాగటంతో ఇంట్రాడేలో 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకటంతో షేర్ల ధర రూ.71.25 కనిష్ఠానికి జారుకున్నాయి. మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు పూర్తిగా నష్టాలతో నిరాశకు గురయ్యారు.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.50 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో వచ్చింది. ఇందుకోసం కంపెనీ ఇన్వెస్టర్లకు 65.79 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో సబ్ స్క్రిప్షన్ కోసం కంపెనీ తన బ్యాండ్ ప్రైస్ ధరను ఒక్కో షేరుకు రూ.72-76గా ఉంచింది. పైగా లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు రూ.1,21,600 కనీస పెట్టుబడిగా పెట్టింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. సుప్రీం ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ ఐపీవో మొత్తం 27.01 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇందులో రిటైల్ కేటగిరీలో 42.5 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ 8.24 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీ 15.7 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకున్నాయి.
కంపెనీ వ్యాపారం..
2005లో స్థాపించబడిన కంపెనీ హౌస్ కీపింగ్ అండ్ క్లీనింగ్, డిస్ఇన్ఫెక్షన్ అండ్ శానిటైజెషన్, స్టాఫింగ్, కార్పొరేట్ ఫుడ్ సొల్యూషన్స్ వంటి వివిధ సేవలను అందిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ హార్డ్ వేర్ సేవల విభాగంలో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మెయింటెనెన్స్, జెనరేటర్లు-యూపీఎస్ మేనేజ్మెంట్ వంటి వివిధ సేవలను వ్యాపార సంస్థలకు అందిస్తోంది. ప్రస్తుత ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, జనరల్ కార్పొరేట్ అవసరాలతో పాటు మరిన్ని ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications