సుదీప్ ఫార్మా IPO సందడి.. ఇన్వెస్ట్ చేసేముందు ఇవి తెలుసుకోండి!
స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఇంగ్రీడియెంట్స్ తయారీ సంస్థ సుదీప్ ఫార్మా (sudeep pharma ipo) ఈ రోజు నవంబర్ 21 శుక్రవారం నాడు పబ్లిక్ ఇష్యూతో (IPO) స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెడుతోంది. ఈ ఐపీఓపై ఇన్వెస్టర్లు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూలో కొత్తగా 16 లక్షల షేర్ల పంపిణీతో పాటు ప్రమోటర్లు దాదాపు 1.35 కోట్ల షేర్లను అమ్మకానికి (OFS) ఉంచనున్నారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రే మార్కెట్‌లో ఇలా..
ఐపీఓకు ముందు జరిగే గ్రే మార్కెట్ ట్రేడింగ్ లో ఈ సంస్థకు మంచి డిమాండ్ లభించింది. గురువారం ఉదయానికి సుదీప్ ఫార్మా షేర్లు రూ.122 ప్రీమియం వద్ద ట్రేడ్ అయ్యాయి. దీనికి ప్రైస్ బ్యాండ్ (Price Band): రూ.593.00 ఉండగా గ్రే మార్కెట్ ప్రైస్ (నవంబర్ 20 నాటికి): రూ.122 ఉంది. దీని ప్రకారం లిస్టింగ్ ధర రూ.715 (రూ.593 + రూ.122) ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

ఐపీఓ డీటెయిల్స్
సుదీప్ ఫార్మా ఐపీఓకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఓసారి చూస్తే..
- ఐపీఓ స్టార్టింగ్ డేట్: శుక్రవారం, నవంబర్ 21, 2025
- ఐపీఓ ఎండింగ్ డేట్: గురువారం, నవంబర్ 25, 2025
- ప్రైస్ రేంజ్: రూ.563 నుంచి రూ. 593 వరకు
- మొత్తం వాల్యూ: రూ.95 కోట్లు + 1,34,90,726 షేర్ల OFS.
- షేర్లు కేటాయించే డేట్: నవంబర్ 26, బుధవారం
- డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు వచ్చే డేట్: నవంబర్ 27, గురువారం
- మార్కెట్లో లిస్టింగ్: నవంబర్ 28, శుక్రవారం
షేర్ల కేటాయింపు
క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB)కు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ కు 15 శాతంగా షేర్లు కేటాయించారు.
రిటైల్ పెట్టుబడి వివరాలు
- లాట్ సైజు: 25 షేర్లు.
- కనీస పెట్టుబడి: రూ.14,825 .
- గరిష్ట పెట్టుబడి: 13 లాట్‌ల వరకు (రూ.1,92,725).
కంపెనీ గురించి..
సుదీప్ ఫార్మా అనేది ప్రధానంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది న్యూట్రిషన్ అండ్ ఫుడ్ పరిశ్రమలకు అవసరమైన స్పెషాలిటీ ఇంగ్రీడియెంట్స్‌ను తయారు చేస్తుంది. యుఎస్, యూరప్, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దీని కార్యకలాపాలు ఉన్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను ప్రధానంగా కొత్త యంత్రాల కొనుగోలుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
కంపెనీ పెర్ఫామెన్స్
ఈ కంపెనీ ఆర్థిక పనితీరు కూడా బాగానే ఉంది. గత కొన్నేళ్లుగా లాభాలు, ఆదాయంలో స్థిరమైన వృద్ధిని కనబరిచింది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో రూ. 62.32 కోట్లు, 2024 లో రూ.133.19 కోట్లు, 2025లో రూ. 38.69 కోట్ల లాభాలను సంపాదించింది.
ఇక ఆదాయం విషయానికొస్తే.. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 428.74 కోట్లు, 2024లో రూ. 459.28 కోట్లు, 2025లో రూ. 502 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
పెట్టుబడి పెట్టొచ్చా?
సుదీప్ ఫార్మా లిమిటెడ్ కు ఉన్న పాజిటివ్స్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా బలబైన కస్టమర్ బేస్ ఉంది. అలాగే ఈ కంపెనీకి బలమైన ఆర్ అండ్ డి కూడా ఉంది. ఫార్మాస్యూటికల్ అండ్ స్పెషాలిటీ న్యూట్రిషన్ రంగంలో ఈ కంపెనీలో బాగా స్థిరపడిందనే చెప్పొచ్చు. వీటితోపాటు కంపెనీ స్థిరంగా లాభాలను ఆర్జిస్తుంది. ఇక కంపెనీ నెగటివ్స్ విషయానికొస్తే.. ఈ కంపెనీకి వస్తున్న ఆదాయం అంతా కొన్ని కీలకమైన కంపెనీల నుంచే వస్తుంది. అలాగే కొత్త ప్రొడక్ట్స్ కు లాంచ్ చేయడంలో కంపెనీ కొంత ఆలస్యం ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు వీటిని పరిగణలోకి తీసుకుని ఇన్వెస్ట్ చేయాలి. సరైన నిర్ణయం కోసం నిపుణుడైన ఆర్ధిక సలహాదారుని సజెషన్ తీసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications