sudeep pharma ipo: సుదీప్ ఫార్మా IPO ఈ రోజే లాస్ట్ డేట్! ఇన్వెస్ట్ చేసేముందు ఇవి తెలుసుకోండి!
వడోదరకు చెందిన సుదీప్ ఫార్మా.. ఐపీఓ బిడ్డింగ్ మూడవ రోజు (మంగళవారం) సాయంత్రం నాటికి మరింత జోరుగా సాగింది. నవంబర్ 21, శుక్రవారం రోజున ప్రారంభమైన ఈ బిడ్డింగ్ ప్రక్రియ నేటితో(నవంబర్25) క్లోజ్ అవుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చెయాలనుకుంటే ఇదే చివరి అవకాశం. అసలు ఈ కంపెనీకి ఎందుకింత డిమాండ్? పెట్టుబడి పెట్టేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

భారీగా సబ్‌స్క్రిప్షన్లు
సుదీప్ ఫార్మా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీస్ కోసం స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పటి నుంచి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) డేటా ప్రకారం మంగళవారం ఉదయం 11:30 గంటల సమయానికి.. అందుబాటులో ఉన్న 10.56 మిలియన్ షేర్లకు గానూ 98.23 మిలియన్ షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. అంటే మొత్తం సబ్‌స్క్రిప్షన్ రేటు సుమారు 9.3 రెట్లుగా ఉంది. వీటిలో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NIIs) విభాగం నుంచి అత్యధిక డిమాండ్ కనిపించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపారు.
- నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NIIs): ఈ విభాగంలో 15.22 రెట్లు అత్యధిక సబ్‌స్క్రిప్షన్ లభించింది.
- రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ (RIIs): రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 5.57 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
- క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs): ఈ విభాగం నుండి కేవలం 14 శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్ నమోదైంది.
గ్రే మార్కెట్(GMP) అంచనా..
గ్రే మార్కెట్ల అంచనా ప్రకారం సుదీప్ ఫార్మా లిస్టింగ్ కాని షేర్లు రూ.679 వద్ద ట్రేడవుతున్నాయి. అంటే IPO లో అత్యధిక ధర (రూ.593) కంటే రూ.86 ఎక్కువ. ఇది 14.50 శాతం లాభాన్ని సూచిస్తుంది. ఈ IPO మొత్తం లక్ష్యం రూ.895 కోట్లు. కాగా.. ప్రైస్ బ్యాండ్.. రూ.563 నుండి రూ.593 ఉంది. లాట్ సైజ్ 25 షేర్లు. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ.95 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు జారీ చేశారు. ప్రమోటర్ల ద్వారా సుమారు రూ.800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో ఉన్నాయి. తాజా ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.75.81 కోట్లు గుజరాత్‌లోని నందేసరి ఫెసిలిటీ 1 వద్ద ప్రొడక్షన్ మెషినరీ కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించబడతాయి.
ముఖ్యమైన తేదీలు
నేటితో సబ్‌స్క్రిప్షన్ విండో ముగియనుంది. ఈ ఐపీఓ(sudeep pharma ipo) షేర్ల అలాట్‌మెంట్ రేపు, అంటే నవంబర్ 26, 2025, బుధవారం ఫిక్స్ చేయబడుతుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. షేర్లు నవంబర్ 27, 2025, గురువారం నాటికి డీమ్యాట్ ఖాతాల్లో జమ అవుతాయి. సుదీప్ ఫార్మా షేర్లు నవంబర్ 28, 2025, శుక్రవారం నాడు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ BSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లలో లిస్ట్ అవుతాయని తాత్కాలికంగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications