Jio IPO: దేశంలోనే అతి పెద్ద ఐపీఓ ప్రారంభం.. గ్రే మార్కెట్‎లో ప్రీమియంలో ట్రేడవుతోన్న షేర్లు..!

జియో ఐపీఓ నేడు ప్రారంభం అయింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్ నేపథ్యంలో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు భారీగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 19న, జియో ప్లాట్‌ఫామ్స్ బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, టి. రోవ్ ప్రైస్, ష్రోడర్స్, జేపీమోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్వెస్కో, ప్రుడెన్షియల్ సహా 212 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 8,109.84 కోట్లు సమీకరించింది. జియో ప్లాట్‌ఫామ్స్ IPO కోసం యాంకర్ ఇన్వెస్టర్ల డిమాండ్ దాదాపు రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఈ స్థాయిలో బిడ్లను ఆకర్షించిన మొదటి భారతీయ ఐపీఓగా ఇది నిలిచింది.

ఈ ఐపీఓ ఈరోజు పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 23న ముగుస్తుంది. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 1,065 నుంచి రూ. 1,119 మధ్య నిర్ణయించారు. ఈ ఆఫరింగ్‌లో గరిష్టంగా 27 కోట్ల కొత్త షేర్లు ఉంటాయి. ఈ కంపెనీ 212 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ. 8,109.84 కోట్లను సమీకరించింది. సింగపూర్‌కు చెందిన జీఐసీ, నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్, కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫ్లోరిడా రిటైర్మెంట్ సిస్టమ్‌తో సహా పలు సావరిన్, పెన్షన్ ఫండ్‌లు కూడా ఈ ఇష్యూలో పెట్టుబడులు పెట్టాయి.

jio

దేశీయ సంస్థాగత డిమాండ్ కూడా బలంగా ఉంది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, నిప్పన్ ఇండియా, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌తో సహా పలు ప్రధాన మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ఆఫరింగ్‌లో పాల్గొన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ పెన్షన్, హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మరియు యూటీఐ పెన్షన్‌తో సహా ప్రధాన బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్‌లు కూడా ఇందులో పాల్గొన్నాయి. గ్రే మార్కెట్ కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్న ప్లాట్‌ఫామ్స్ ప్రకారం కంపెనీ షేర్లు 22-23 శాతం మధ్య గ్రే మార్కెట్ ప్రీమియం కలిగి ఉన్నాయి. ఇన్వెస్టర్‌గెయిన్ కంపెనీ షేర్లకు రూ. 247 జీఎంపీని కోట్ చేసింది. ఇది 22.1 శాతం లిస్టింగ్ లాభాన్ని సూచిస్తుంది. ఐపీఓ వాచ్ 23.2 శాతం జీఎంపీని కోట్ చేసింది.

ఇది చందాదారుల సంఖ్య పరంగా భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్ గా ఉందని నిపుణలు చెబుతున్నారు. ఇది దేశంలోని వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో అధిక భాగాన్ని నిర్వహిస్తోందని గుర్తు చేశారు. దీనికి సొంత టెక్నాలజీతో నిర్మించిన దేశవ్యాప్త 5జీ నెట్‌వర్క్, జియోఎయిర్‌ఫైబర్ పేరుతో అభివృద్ధి చెందుతున్న ఫిక్స్‌డ్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారం ఉన్నాయి. డిజిటల్ సేవల్లో క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టే పెట్టుబడులలో దీన్ని పరిశీలించవచ్చని చెబుతున్నారు. జియో ప్లాట్ ఫామ్స్ 2016లో ప్రారంభమైనప్పటి నుంచి గత దశాబ్దంలో విప్లవాత్మకమైన ధరల విధానం మరియు విభిన్నమైన ఆఫరింగ్ ద్వారా భారతదేశ టెలికాం రంగ స్వరూపాన్ని మార్చేసింది. ఆ తర్వాత మిగతా టెలికామ్ సంస్థలకు ధీటుగా నిలిచింది. జియో కంపెనీ ఈక్విటీ షేర్లను అక్టోబర్ 28న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ లిస్ట్ కానున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+