స్టాక్ మార్కెట్‌లో జోష్.. ఇన్వెస్టర్లకు పండగే పండగ.. భారీగా దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ..

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశం కావడంతో, దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీనివల్ల మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు చెరో 1% కంటే ఎక్కువ లాభపడ్డాయి.

మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే (ఉదయం 9:20 గంటలకు) బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,012 పాయింట్లు (1.37%) లాభపడి 74,844 వద్ద కదలాడగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 286 పాయింట్లు (1.24%) పుంజుకుని 23,447 మార్కు వద్ద ట్రేడ్ అయింది. ప్రారంభంలో ఒకానొక దశలో సెన్సెక్స్ గరిష్టంగా 1,026 పాయింట్లు, నిఫ్టీ 294 పాయింట్ల మేర ఎగబాకాయి. ఈ భారీ అప్‌ట్రెండ్ కారణంగా ఇన్వెస్టర్ల సంపదకు రెక్కలొచ్చాయి. జూన్ 11, 2026 నాటికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ₹4,51,83,025 కోట్లుగా ఉండగా, నేడు (జూన్ 12, 2026) మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే అది ₹4,58,75,062 కోట్లకు చేరింది. అంటే మార్కెట్ తెరుచుకున్న కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ₹6.92 లక్షల కోట్లు (దాదాపు ₹7 లక్షల కోట్లు) పెరిగింది.

Sensex today Nifty today stock market rally Sensex gains 900 points Nifty up 250 points Indian stock market Dalal Street market news NSE Nifty BSE Sensex stock market update share market news 900 250 NSE BSE

ఈ రోజు మార్కెట్ పెరుగుదలకు అన్ని రంగాలు తోడ్పాటునందిస్తున్నాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ రియల్టీ రంగం అత్యంత చురుకుగా ఉంటూ 2% కంటే ఎక్కువ లాభంతో దూసుకుపోతోంది. దీనితో పాటు నిఫ్టీ ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు సైతం 1.5% పైగా బలాన్ని పుంజుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాలు కూడా అర శాతానికి పైగా లాభాల్లో పయనిస్తున్నాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్‌తో పాటు మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా ఒకటిన్నర శాతం మేర పెరగడం మార్కెట్ యొక్క విస్తృత స్థాయి బలాన్ని సూచిస్తోంది.

Also Read

ఇక సెన్సెక్స్ 30 దిగ్గజ షేర్లలో కేవలం 'టెక్ మహీంద్రా' మినహా మిగిలిన 29 షేర్లు లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఇండిగో, ఎల్&టి (L&T), ట్రెంట్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతానికి బీఎస్ఈలో ట్రేడవుతున్న మొత్తం 2,665 షేర్లలో 2,209 షేర్లు గ్రీన్ జోన్‌లో (లాభాల్లో) బలంగా ట్రేడ్ అవుతుండగా, కేవలం 328 షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. మరో 128 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. కాగా, మార్కెట్ జోరుకు సంకేతంగా 56 షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకగా, 36 షేర్లు తమ ఏడాది కాలపు గరిష్ట (52-week high) స్థాయిని తాకడం విశేషం. దౌత్యపరమైన సానుకూలతలు ఇలాగే కొనసాగితే మార్కెట్లు రోజంతా లాభాల్లోనే ముగిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+