భారత్-అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం భారత స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపిరి పోసింది. మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకువెళ్లాయి.పెట్టుబడిదారుల విశ్వాసం ఒక్కసారిగా పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ లాభాలతో గ్రీన్‌లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన మొదటి నిమిషాల్లోనే సెన్సెక్స్ 4,200 పాయింట్లకు పైగా పెరిగి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా దాదాపు 750 పాయింట్లు ఎగబాకి కీలక స్థాయిలను దాటింది. మార్కెట్ ప్రారంభానికి ముందే నిఫ్టీ దాదాపు 800 పాయింట్ల ప్రీమియంతో ట్రేడింగ్ అవ్వడం, ఈ రోజు మార్కెట్ ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.

ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణం భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందమేనని చెప్పవచ్చు. ఈ ఒప్పందం కింద భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గే అవకాశం ఉందన్న వార్త వెలువడింది. దీనితో భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా ఐటీ, టెక్స్‌టైల్స్, ఫార్మా వంటి రంగాలకు ఇది పెద్ద దన్నుగా మారింది. అమెరికాకు భారీగా సేవలు, ఉత్పత్తులు ఎగుమతి చేసే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీల షేర్లు ఒక్కసారిగా 5 నుంచి 7 శాతం వరకు లాభపడ్డాయి. అలాగే టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. పెట్టుబడిదారులు ఈ రంగాలపై భారీగా ఆసక్తి చూపడంతో సూచీలు మరింత బలపడ్డాయి.
ఉదయం 10 గంటల సమయానికి దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా కొనసాగాయి. NSEలో నిఫ్టీ సూచీ 750 పాయింట్ల లాభంతో.. అంటే 5 శాతం పెరిగి 26,341.20 స్థాయిలో ట్రేడింగ్ అయింది. అదే సమయంలో BSEలో సెన్సెక్స్ సూచీ 1,929 పాయింట్లు లేదా 2.36 శాతం ఎగబాకి 83,595 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 షేర్లు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ర్యాలీకి అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీవెయిట్ స్టాక్స్ ముందుండి నడిపించాయి.
ఐటీ రంగం నుంచి ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్ బలమైన లాభాలతో మెరిశాయి. అలాగే టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), ఎల్ అండ్ టి, ఇండిగో, సన్ ఫార్మా, ట్రెంట్, మారుతి సుజుకి వంటి షేర్లు కూడా ర్యాలీలో భాగమయ్యాయి. ఈ ప్రధాన స్టాక్స్ అన్నీ కలిపి సుమారు 3 శాతం నుంచి 7 శాతం వరకు లాభపడి సూచీలను మరింత పైకి తీసుకెళ్లాయి.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఊగిసలాటలు కనిపించినప్పటికీ.. ఫిబ్రవరి 2న జరిగిన సెషన్‌ను stock markets దృఢంగా ముగించాయి. చివరి దశలో కొనుగోళ్ల జోరు పెరగడంతో సెన్సెక్స్ 943 పాయింట్ల లాభంతో 81,666 స్థాయిలో క్లోజ్ అయింది. అదే సమయంలో నిఫ్టీ కూడా సుమారు 263 పాయింట్లు ఎగబాకి 25,100 దగ్గర స్థిరపడింది. ఈరోజు మార్కెట్ ప్రారంభంలోనే మార్కెట్ గ్యాప్-అప్‌తో 85,323.20 వద్ద ఓపెన్ అయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో కొనుగోళ్ల జోరు కొనసాగడంతో సెన్సెక్స్ మరింత ఎగబాకి ఇంట్రాడే గరిష్ట స్థాయి 85,871.73ను తాకింది.
అయితే, మధ్యాహ్నం సమయంలో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) కారణంగా కొంత ఒత్తిడి కనిపించింది. దాంతో సెన్సెక్స్ దిగివచ్చి కనిష్టంగా 83,501.22 స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ, దిగువ స్థాయిల్లో మళ్లీ కొనుగోళ్లు రావడంతో సూచీ పూర్తిగా బలహీనపడకుండా నిలదొక్కుకుంది. ఈ మార్కెట్ ర్యాలీతో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.10 లక్షల కోట్ల వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత ఏడాది కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అధిక సుంకాల కారణంగా భారత మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు తగ్గడం, ఎగుమతులపై ప్రభావం పడటం వల్ల మార్కెట్‌లో నిరాశ వాతావరణం నెలకొంది. అయితే తాజా వాణిజ్య ఒప్పందంతో పరిస్థితి పూర్తిగా మారింది. రష్యా చమురుపై ఆధారాన్ని కొంతవరకు తగ్గించి, అమెరికాతో వ్యూహాత్మకంగా దగ్గరవ్వడం వల్ల భారత్‌కు పన్నుల భారం తగ్గడమే కాకుండా, విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించే అవకాశం ఏర్పడింది. ఇదే ప్రస్తుతం మార్కెట్‌లో కనిపిస్తున్న దూకుడుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ మార్కెట్‌లో కూడా సానుకూల వాతావరణం కనిపించింది. భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడుతూ 90.15 స్థాయిలో ట్రేడింగ్ అవుతోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలకు పరిమితమైన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మంగళవారం మళ్లీ భారీగా కొనుగోళ్లు ప్రారంభించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications