Stock Market Closing: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 78,079 వద్ద ముగియగా, నిఫ్టీ 40 పాయింట్లు తగ్గి 24,395.85 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.15 శాతం పెరగ్గా.. స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.27 శాతం స్వల్పంగా పెరిగింది. హర్మూజ్ తెరవడంపై నెలకొన్న అనిశ్చితి, చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండిగో, ఎన్టీపీసీ, బీఈఎల్, ఎల్అండ్టీ, హిందుస్థాన్ యూనిలిర్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఏసియన్ పెయింట్స్, ట్రెంట్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంకు, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, భారతి ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్ లాభాల్లో ముగిశాయి.
అదానీ పోర్ట్స్, ఎస్బీఐఎన్, యాక్సెస్ బ్యాంక్, మారుతి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్, రిలయన్స్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఆస్ట్రల్ లిమిటెడ్, నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, శారదా ఎనర్జీ & మినరల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ గా ఉండగా.. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఫిజిక్స్‌వాలా లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

నిఫ్టీ మెటల్ 1.05 శాతం క్షీణించింది. బ్యాంక్ నిఫ్టీ 0.43 శాతం పడిపోగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 0.37 శాతం తగ్గింది. మరోవైపు, నిఫ్టీ రియల్టీ 1 శాతం, ఎఫ్‌ఎంసీజీ దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ అర శాతం వరకు పెరిగాయి. భారత రూపాయి 11 పైసలు క్షీణించి, గత ముగింపు ధర 95.33తో పోలిస్తే డాలర్‌కు 95.44 వద్ద ముగిసింది. భారతదేశ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, లేదా రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 4.45 శాతానికి పెరిగింది. ఇది కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌క్రూడ్ ధర 87.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.. బంగారం ఔన్సు ధర 4,381.47 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications