Stock Market Closing: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఐటీ, బ్యాంక్ షేర్లు..!

బుధవారం స్టాక్ మార్కెట్లు రాణించాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ రంగాలకు చెందిన బ్లూ-చిప్ స్టాక్‌లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 790 పాయింట్లు పెరిగి 76,991.22 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 197 పాయింట్లు పెరిగి 24,021.65 వద్ద ముగిసింది. ఆటో, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా సూచీలన్నీ గ్రీన్ లో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్, 1.02 శాతం తగ్గి బ్యారెల్‌కు 76.29 డాలర్లకు చేరింది. హర్మూజ్ జలసంధిని దాటి 11 భారత నౌకలు ఇండియాకు వస్తున్న నేపథ్యంలో చమురు ధర నాలుగు నెలల కనిష్టానికి చేరుకుంది. అంతేకాకుండా ఔన్సు బంగారం ధర 4,060 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతానికి పైగా పెరగ్గా, బ్యాంక్ నిఫ్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతానికి పైగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండిగో, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఆదానీ పోర్ట్స్, యాక్సెస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎంఅండ్, టైటాన్, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఎల్అండ్ టీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఎటర్నల్, భారతి ఎయిర్ టెల్, బీఈఎల్, మారుతి, టాటా స్టీల్, ఎన్టీపీసీ నష్టాల్లో ముగిశాయి.

stock market

ఈ రోజు ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్లు, ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ వంటి మార్గాల ద్వారా నిధుల లభ్యతను సులభతరం చేయడంతో బ్యాంకింగ్ స్టాక్స్ రాణించాయి. మరో పక్క ఐటీ స్టాక్స్ కూడా రాణించాయి. ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ ఏఐ ప్రభావం తమ కంపెనీపై ఉండదని వ్యాఖ్యానించడంతో ఐటీ షేర్లు రాణించాయి.

భారత్, అమెరికాల మధ్య చరిత్రాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందనే వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి.మరో పక్క నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి సూచీ 10 శాతం పతనం అయింది. ఈ రోజు సెషన్‌లో కోస్పి సూచీ తిరిగి పుంజుకోవడం కూడా ఇతర మార్కెట్లపై ప్రభావం చూపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+