Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు..!
శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 827.57 పాయింట్లు పెరిగి 77,569.39 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 244.10 పాయింట్లుపెరిగి 24,206.90 వద్ద ముగిసింది. సుమారు 2756 షేర్లు లాభపడగా, 1316 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో జియో ఫైనాన్షియల్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే మరియు సన్ ఫార్మా ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో రిలయన్స్, టెక్ మహీంద్రా, బెల్, యాక్సెస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బాజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐఎన్, ఇండిగో, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, మారుతి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, కోటక్ మహింద్రా బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, ట్రెంట్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, ఎటర్నల్ నష్టాల్లో ముగిశాయి.

రియల్టీ స్టాక్స్ అగ్రగామిగా నిలిచాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 3.5 శాతం పెరగ్గా.. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం పుంజుకుంది. టీసీఎస్ జూన్ త్రైమాసిక ఫలితాల తర్వాత వచ్చిన లాభాల కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2 శాతం పెరిగింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.5 శాతం, నిఫ్టీ బ్యాంక్ 1.4 శాతం పెరిగాయి. ఆయిల్ & గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్‌లు 1 శాతం నుంచి 1.3 శాతం మధ్య లాభపడ్డాయి. ఆటో ఇండెక్స్ 0.72 శాతం పెరిగింది.
నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 1.4 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.5 శాతం పెరిగింది. అమెరికా డాలర్ బలహీనపడటంతో భారత రూపాయి వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేసింది.గురువారం ముగింపు ధర 95.38తో పోలిస్తే, శుక్రవారం భారత రూపాయి డాలర్‌కు 95.32 వద్ద స్వల్పంగా పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications