Stock Market: నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్‎ల్లో అమ్మకాల ఒత్తిడి..

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఆగస్టు 27న భారతీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 166.84 పాయింట్లు పెరిగి 77,639.78 వద్ద ప్రారంభం కాగా.. నిఫ్టీ 78.40 పాయింట్లు పెరిగి 24,286.15 స్టార్ట్ అయింది. ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం 10 గంటల 44 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టోపోయి 77314 వద్ద కొనసాగుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్లు తగ్గి 24169 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ ఇండెక్స్ లో కోటక్ మహింద్రా బ్యాంకు, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, బీఈఎల్, యాక్సెస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎటర్నల్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఎయిర్ టెల్, ఎల్అండ్ టీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, ఇండిగో, ట్రెంట్, ఇన్ఫోసిస్, మారుతి, ఎస్బీఐఎన్, ఐటీసీ, ఎంఅండ్ఎం, హెచ్డీ ఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్ సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ 0.1 శాతం తగ్గగా.. నిఫ్టీ ఇన్ ఫ్రా 0.15 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.06, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.45 శాతం, నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ 0.06 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.30 శాతం, నిఫ్టీ ఫార్మా 0.13 శాతం పెరిగింది. ఏఎస్ఎం టెక్నాలజీస్ షేరు ధర రూ. 375.5 పెరిగి రూ. 4,930 వద్ద నమోదైంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,192.18 కోట్లుగా ఉంది. బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ షేర్ ధర 3.96 శాతం పెరిగి రూ. 634.95 వద్ద నమోదైంది. ఈ సెషన్‌లో షేర్ గరిష్టంగా రూ. 635.95, కనిష్టంగా రూ. 616.25 స్థాయిలను తాకింది.

stock market

కాగా ఈ రోజు బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.770 తగ్గి రూ.1,62,980 వద్ద నమోదు అయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.700 తగ్గి రూ.1,49, 400 పలుకుతుండగా.. తులం 18 క్యారెట్ల పుత్తడి ధర రూ.570 తగ్గి రూ.1,22,240 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా చమురు ధర పెరగడం, అమెరికా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగినట్లు నిపుణులు పెరుగుతున్నారు. పెట్టుబడిదారులు షేర్లు అమ్మకాలు చేయడంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+