స్టాక్ మార్కెట్‌లో బిగ్ ట్విస్ట్.. లాభాలతో ప్రారంభమై నిమిషాల వ్యవధిలో నష్టాల్లోకి జారిన సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం స్వల్ప లాభాలతో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ఆ నిలకడ ఎక్కువ సేపు కొనసాగలేదు. ఉదయం 10:45 గంటల సమయానికల్లా లాభాల స్వీకరణ మొదలవ్వడంతో ప్రామాణిక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 74,826 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,446 స్థాయి వద్ద ప్రారంభమయినప్పటికీ, నష్టభయం పెరగడంతో ఉదయాన్నే షేర్లు కొనుగోలు చేసిన వ్యాపారులు స్వల్ప పెరుగుదల కనిపించగానే విక్రయాలకు దిగారు.

ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 44.77 పాయింట్లు లాభపడి 74,809 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ దాదాపు స్థిరంగా 23,430.50 వద్ద కొట్టుమిట్టాడింది. ప్రధాన సూచీలతో పాటు నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.36 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.03 శాతం మేర క్షీణించి విస్తృత మార్కెట్‌లోనూ ఒత్తిడిని ప్రతిబింబించాయి. రంగాల వారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంకులు 1 శాతంపైగా పుంజుకుని ఆకట్టుకోగా, మహీంద్రా & మహీంద్రా, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి దిగ్గజాల పతనంతో ఆటో రంగం తీవ్ర క్షీణతను చవిచూసింది.

Stock Market Live Stock Market Today Share Market Today Sensex Today Nifty Today market fall stock market crash selling pressure market reversal early gains erased Sensex fall Nifty fall Indian stock market stock market update market sell-off investor sentiment morning market update 10 45 AM market Sensex Nifty Stock Market Live Stock Market Today Sensex Today Nifty Today

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు ఏకంగా 101.22 డాలర్లు దాటి దాదాపు 102 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వడమే భారత మార్కెట్లను కుదిపేస్తున్న అతిపెద్ద ప్రతికూల అంశంగా మారింది. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థపై భయాలు పెంచాయి.

అత్యధికంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు అధిక ముడి చమురు ధరల వల్ల దిగుమతి బిల్లులు పెరగడంతో పాటు రూపాయి క్షీణించి, రవాణా, ఇంధన ధరల భారంతో ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం ఉంది. దీనికితోడు అమెరికా 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరగడం, బలహీనమైన ఆసియా మార్కెట్ల సంకేతాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం రూ. 583 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 1,509 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు.

ఈ అస్థిరతల మధ్య మార్కెట్లో పలు కార్పొరేట్ డీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కరోనా రెమెడీస్ కంపెనీలో ఒక ప్రధాన వాటాదారుడు తన 4.3 శాతం ఈక్విటీ వాటాను (సుమారు 26.31 లక్షల షేర్లు) ఒక్కో షేరుకు రూ. 2,106 ధర చొప్పున రూ. 554 కోట్ల భారీ బ్లాక్ డీల్ ద్వారా విక్రయించారు. మరోవైపు దిలీప్ బిల్డ్‌కాన్ తన నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రసార ప్రాజెక్ట్‌లో తన 51 శాతం ఈక్విటీ వాటాను ఆల్ఫా ఆల్టర్నేటివ్స్‌కు విక్రయించేందుకు రూ. 2,914 కోట్ల ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ వద్ద కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం రూ. 2,171 కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ ప్రాజెక్ట్ పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత దిలీప్ బిల్డ్‌కాన్ పూర్తి నిష్క్రమణ ద్వారా తన అప్పులను, బ్యాలెన్స్ షీట్ ఒత్తిడిని తగ్గించుకోనుంది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నిఫ్టీకి 23,600 స్థాయి బలమైన నిరోధకంగా పనిచేస్తోంది. సూచీ ఈ స్థాయి కంటే దిగువన ఉన్నంత కాలం సెంటిమెంట్ బలహీనంగానే ఉంటుందని, 23,350 తక్షణ మద్దతు స్థాయి విఫలమైతే నిఫ్టీ 23,150 వైపు జారవచ్చని యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా పేర్కొన్నారు. ముడి చమురు మంటలు తగ్గితే తప్ప ఉపశమనం లభించదని విశ్లేషించారు. కాగా ప్రాథమిక వాటా విపణి (IPO) మార్కెట్ గురువారం అత్యంత రద్దీగా మారింది. వీగాలాండ్ డెవలపర్స్, మహారాజా & స్పీడెక్స్, ఓం గెలాక్సీ, రక్షణ్ ట్రాన్స్‌ఫార్మర్స్ మరియు పంచత్వ భారత్ కంపెనీల ఐపీఓలు నేటి నుంచే ప్రారంభం కాగా, రెంట్ మోజో, స్టీమ్‌హౌస్ ఇండియా, కరమ్తారా ఇంజనీరింగ్ వంటి మెయిన్‌బోర్డ్ ఐపీఓలు రెండవ రోజు బిడ్డింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్ ఐపీఓలు నేడు ఆఖరి రోజు సబ్‌స్క్రిప్షన్‌కు సిద్ధమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+