స్టాక్ మార్కెట్ సూపర్ ర్యాలీ.. షేర్ మార్కెట్లని పరుగులు పెట్టిస్తున్న ఐటీ స్టాక్స్..

Stock Market Today:వరుస నష్టాలతో విలవిలలాడిన భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం పూట ఊరట కలిగించే బలమైన రికవరీని సాధించింది. ఆసియా మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు గరిష్ట స్థాయిల నుండి దిగిరావడంతో దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్ల ఉత్సాహం వెల్లివిరిసింది. ఉదయం 11 గంటల సమయానికి ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం కంటే ఎక్కువగా లాభపడి జోరుగా ట్రేడ్ అవుతున్నాయి.

బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ ఏకంగా 72,400 మార్కును అధిగమించగా.. ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 సూచీ కీలకమైన 22,500 మైలురాయిని దాటి ముందుకు సాగుతోంది. టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్లు, ముడి చమురు ధరల తగ్గుదల, ఇరాన్‌పై తక్షణ దాడులు ఉండబోవన్న ట్రంప్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతిచ్చాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలగా, ఐటీ సూచీ కూడా గణనీయంగా పెరిగింది.

Stock Market Today Sensex Jumps 750 Points Nifty 50 Today IT Stocks Rally TCS Share Price Infosys Share Price US Labour Certification Curbs Indian Stock Market Rally Stock Market Live Updates Crude Oil Prices Trump Iran Statement Market Recovery Indian Equity Markets Stock Market News October 9 2026 750

మార్కెట్‌లోనూ (Broad Market) కొనుగోళ్ల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. మిడ్-క్యాప్ సూచీ 1.25 శాతం వృద్ధి నమోదు చేయగా, ఇన్వెస్టర్లలో భయాందోళనలను కొలిచే 'ఇండియా విక్స్' (India VIX) సూచీ దాదాపు 4 శాతం పడిపోవడం మార్కెట్‌లో స్థిరత్వం తిరిగి వస్తోందనే నమ్మకాన్ని పెంచింది. గురువారం నాటి తీవ్ర పతనం తర్వాత పెట్టుబడిదారులు తక్కువ ధరల్లో లభిస్తున్న నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడంతో ఈ లాభాలు సాధ్యమయ్యాయి.

Also Read

రంగాల వారీగా పరిశీలిస్తే ఐటీ (IT) రంగం అత్యంత బలమైన ప్రదర్శనతో మార్కెట్‌ను ముందుండి నడిపిస్తోంది. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 3.2 శాతం ఎగబాకింది. విదేశీ ఐటీ రంగానికి చెందిన అనుకూల పరిణామాలు, మెరుగైన త్రైమాసిక ఫలితాల అంచనాలు ఈ రంగానికి కొండంత బలాన్నిచ్చాయి. ఐటీతో పాటు లోహాలు (Metals), ఆటోమొబైల్, రియల్టీ రంగ సూచీలు కూడా ఒక్కొక్కటి 1 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. అయితే, ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా ఆయిల్ అండ్ గ్యాస్ రంగం మాత్రం కొంత బలహీనంగానే ట్రేడ్ అవుతోంది.

నిఫ్టీ 50 సూచీలోని 50 ప్రధాన స్టాక్స్‌లో ఏకంగా 46 షేర్లు లాభాల్లో ట్రేడ్ కావడం విశేషం. ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) దాదాపు 6 శాతం పెరిగి నిఫ్టీ ట్యాప్ గేైనర్‌గా నిలిచింది. దీంతోపాటు ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్ షేర్లు ఒక్కొక్కటి 3 శాతానికి పైగా లాభపడి సూచీల పెరుగుదలకు సహకరించాయి. మరోవైపు బీఎస్ఈ జాబితాలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు మాత్రమే నష్టపోయిన ప్రధాన స్టాక్‌లుగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గరిష్ట స్థాయిల నుండి తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మునుపటి సెషన్‌లో 4 శాతం పెరిగి బ్యారెల్‌కు 104 డాలర్ల పైన ముగిసినప్పటికీ, శుక్రవారం ఉదయానికి అర శాతానికి పైగా పడిపోయి $104 కంటే దిగువకు చేరింది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా తమ గరిష్ట స్థాయిల నుండి ఉపశమనం పొందడం భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు సానుకూలంగా మారింది. తీవ్ర ఆందోళనల మధ్య ఈ శుక్రవారం నాటి రికవరీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలకు కొంత సమరసమైన ఊరటనిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+