క్షణాల్లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్క కారణంతో అమ్మకాల కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు..

Stock Market Today: సోమవారం ఉదయం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ ఆ జోరును నిలబెట్టుకోలేకపోయింది. ఉదయం 11 గంటల సమయం తర్వాత మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా పెరగడంతో నిఫ్టీ తన రోజువారీ గరిష్ట స్థాయి నుండి ఏకంగా 200 పాయింట్ల వరకు పడిపోయింది. సెన్సెక్స్ 900 పాయింట్ల వరకు పడిపోయింది.

రూపాయి మారకం విలువ బలంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లలో కొనుగోలు విశ్వాసం లోపించడం మార్కెట్‌ను పతనం వైపునకు నెట్టింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారు 0.5 శాతం నష్టంతో కొనసాగుతోంది.

మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న కొన్ని కఠినమైన ద్రవ్య విధాన చర్యలు కూడా మార్కెట్‌లో ఆందోళనలను పెంచాయి. రూపాయిని స్థిరీకరించే ప్రయత్నాలతో పాటు, బ్యాంకింగ్ వ్యవస్థ నుండి అదనపు నగదును (Liquidity) ఉపసంహరించుకోవడానికి ఆర్‌బీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం రోజున రూ. 25,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించనుంది.

Stock Market Today Sensex Live Updates Nifty 50 Today Sensex Falls 900 Points Nifty Falls Today Why Stock Market Is Falling FII Selling Crude Oil Prices US Bond Yields RBI Interest Rates Indian Stock Market News IT Stocks Banking Stocks RBI

అంతేకాకుండా, అక్టోబర్ 16 నుండి బ్యాంకులు ప్రతిరోజూ నిర్వహించాల్సిన నగదు నిల్వ (CRR/Cash Reserve Ratio) నిబంధనను ప్రస్తుతమున్న 90% నుండి ఏకంగా 99%కి పెంచాలని ఆదేశించింది. ఇది వడ్డీ రేట్ల పెంపు కానప్పటికీ, బ్యాంకులు రోజువారీగా పాటించాల్సిన నిబంధనలను కఠినతరం చేయడమేనని నిపుణులు భావిస్తున్నారు.

మార్కెట్‌ను ఒత్తిడికి గురిచేస్తున్న ఆరు ప్రధాన కారణాలు:

1. భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ (Profit Booking): అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం నాడు నిఫ్టీ ఏకంగా 288.65 పాయింట్లు (1.30%) పెరిగి 22,520.45 వద్ద ముగిసింది. ఆ భారీ ర్యాలీ తర్వాత సోమవారం ఉదయం కూడా అదే జోరు కొనసాగినప్పటికీ, ఇన్వెస్టర్లు అధిక ధరల వద్ద తమ షేర్లను విక్రయించి నగదును వెనక్కి తీసుకోవడానికి (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, మార్కెట్ స్థిరంగా పైకి వెళ్లాలంటే నిఫ్టీ కనీసం 22,600-22,650 స్థాయిల పైన నిలబడాలి. కానీ ఆ స్థాయిని కాపాడుకోవడంలో విఫలమవడం మార్కెట్ బలహీనతకు అద్దం పడుతోంది. కోటక్ నియోకు చెందిన శ్రీకాంత్ చౌహాన్ 22,300 స్థాయిని అత్యంత కీలకమైన మద్దతుగా (Support) పేర్కొన్నారు. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయి కంటే కిందకు పడిపోతే అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది.

Also Read

2. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు (FII Outflows): భారతీయ మార్కెట్ల నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) నిధులను ఉపసంహరించుకునే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో ఇప్పటివరకు కేవలం విదేశీ మదుపరులే భారతీయ ఈక్విటీల నుండి ఏకంగా రూ. 44,166 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ భారీ నిధుల తరలింపు మార్కెట్ ఏ చిన్న లాభాన్ని సాధించినా దానిని నిలబెట్టుకోలేకుండా చేస్తోంది. అక్టోబర్ 9 నాటి ట్రేడింగ్‌లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా 11వ సెషన్‌లోనూ రూ. 3,568 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) రూ. 4,743 కోట్ల కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఎఫ్‌ఐఐల అమ్మపాల ఒత్తిడిని పూర్తిగా తిప్పికొట్టలేకపోయారు.

3.పెరుగుతున్న మార్కెట్ అస్థిరత (Rising Volatility / India VIX): మార్కెట్‌లోని భయాలను ప్రతిబింబించే 'ఇండియా విక్స్' (India VIX) సూచీ సుమారు 4 శాతం మేర పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో మార్కెట్‌లో తీవ్రమైన హెచ్చుతగ్గులు మరియు అస్థిరత ఉండబోతున్నట్లు సంకేతం ఇస్తుంది. విక్స్ పెరగడం అంటే ఇన్వెస్టర్లలో భయం, ఆందోళన పెరుగుతున్నాయని అర్థం. ఇది మార్కెట్ పతనాన్ని నేరుగా హామీ ఇవ్వకపోయినా, పెట్టుబడిదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తుంది.

4.యూఎస్ బాండ్లపై గరిష్ట రాబడులు (High US Bond Yields): అమెరికాలో 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్లపై లభిస్తున్న రాబడి (Treasury Yield) సుమారు 5.24% వద్ద అధికంగా కొనసాగుతోంది. బాండ్ల ధరలు పడిపోవడం వల్ల వాటిపై వచ్చే రాబడి శాతం పెరిగింది. దీనివల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి ఉపసంహరించుకుని, సురక్షితమైన యూఎస్ బాండ్ల వైపు మళ్లించే అవకాశం ఉంది. అధిక బాండ్ ఈల్డ్స్ భారతీయ స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ కూడుకున్న పెట్టుబడులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి.

5. ద్రవ్యోల్బణం, త్రైమాసిక ఫలితాల భయాలు: రాబోయే రోజుల్లో వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాలు మరియు కంపెనీల క్యూ2 (Q2FY27) ఆర్థిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ రిటైల్ దిగ్గజం డిమార్ట్ (DMart) మార్జిన్లు, అమ్మకాలు అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయా లేదా అనేదానిపై మార్కెట్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనిశ్చితి వాతావరణం కారణంగా మదుపరులు కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు.

6. భారతీయ రూపాయిపై ఒత్తిడి, ద్రవ్య లభ్యత: రూపాయి మారకం విలువ స్థిరంగా ఉన్నప్పటికీ, మార్కెట్లో నగదు లభ్యతను తగ్గించడానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు స్వల్పకాలికంగా సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నిధులను లాగేసుకోవడం వల్ల కార్పొరేట్ సంస్థలకు, రుణాలు తీసుకునే వారికి కొంత మేర వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ కలిసి సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్‌ను కోలుకోలేని విధంగా నష్టాల బారిన పడేలా చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+