లాభాలతో పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్..ఇరాన్ కొత్త ప్రపోజల్ దెబ్బకు దూసుకెళ్లిన పలు రంగాల షేర్లు..

భారత ప్టాక్ మార్కెట్ ఎట్టకేలకు గాడిలో పడింది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న నష్టాల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సోమవారం (ఏప్రిల్ 27, 2026) ట్రేడింగ్ ప్రారంభంలోనే భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా ఫార్మా, మెటల్, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు గణనీయమైన రికవరీని సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు అందడం, అలాగే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల ఆశలు చిగురించడం ఇన్వెస్టర్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది.

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ సుమారు 546 పాయింట్లకు పైగా లాభపడి 77,210 మార్కును తాకగా, నిఫ్టీ 50 కూడా 197 పాయింట్ల వృద్ధిని నమోదు చేసి 24,000 మైలురాయిని తిరిగి చేరుకుంది. మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేసిన ప్రధాన స్టాక్స్‌లో సన్ ఫార్మా అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ షేర్లు దాదాపు 7.5% మేర పెరిగి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. వీటితో పాటు అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా వంటి షేర్లు కూడా మంచి పనితీరును కనబరిచాయి. ఫార్మా రంగం సూచీ ఏకంగా 2.78% పెరగడం గమనార్హం.

Nifty50 above 24050 Sensex up 500 points stock market today BSE Sensex rally Nifty50 gains today Indian stock market news share market live updates Sensex jumps 500 points Nifty crosses 24050 Dalal Street rally Iran proposal to US impact Iran US peace proposal stock market surge India Sensex today news Nifty today updates market opening gains Indian equities rise geopolitical relief rally Middle East tensions ease market investors buying spree India Sensex Nifty latest BSE market news NSE Nifty50 update stock market headlines India today market trends 50 24050 500 50 500 24050 50

అయితే Market అంతా లాభాల్లో ఉన్నప్పటికీ కొన్ని ఆర్థిక సంస్థల షేర్లు మాత్రం ఒత్తిడికి లోనయ్యాయి. శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగంపై కొంత ప్రభావం చూపాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 107 డాలర్ల వద్ద ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను స్వల్పంగా కలవరపెడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సమసిపోకపోవడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి, ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read

మరోవైపు విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ స్వల్పంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 94.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కార్పొరేట్ రంగం విషయానికొస్తే, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ వంటి సంస్థలు తమ నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన లాభాలను ప్రకటించడం కూడా మార్కెట్ నిలదొక్కుకోవడానికి సహాయపడింది.

Nifty50 above 24050 Sensex up 500 points stock market today BSE Sensex rally Nifty50 gains today Indian stock market news share market live updates Sensex jumps 500 points Nifty crosses 24050 Dalal Street rally Iran proposal to US impact Iran US peace proposal stock market surge India Sensex today news Nifty today updates market opening gains Indian equities rise geopolitical relief rally Middle East tensions ease market investors buying spree India Sensex Nifty latest BSE market news NSE Nifty50 update stock market headlines India today market trends 50 24050 500 50 500 24050 50

నిపుణుల విశ్లేషణ ప్రకారం, నిఫ్టీకి ప్రస్తుతం 23,500 వద్ద బలమైన మద్దతు (Support) ఉండగా, 24,300 స్థాయిని దాటడం కీలకమైన ప్రతిఘటన (Resistance) గా కనిపిస్తోంది. యుద్ధ భయాలు తగ్గి, క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరపడితే మార్కెట్ మళ్ళీ కొత్త గరిష్టాలను చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు కార్పొరేట్ ఫలితాలే రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+