స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లను కలవరపెడుతున్న పశ్చిమాసియా వార్..

పశ్చిమ ఆసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వ్యతిరేక పవనాల నడుమ గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరతల మధ్య ముగిసింది. ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన సూచీలు.. రోజు మొత్తం పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయ్యాయి. చివర్లో లార్జ్-క్యాప్, కొన్ని కీలక రంగాల షేర్లలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అయితే, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ విభాగాల్లో లాభాల స్వీకరణ తీవ్రమవ్వడంతో విస్తృత మార్కెట్ ఒత్తిడిలోనే కొనసాగింది.

ముగింపు సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 273.55 పాయింట్లు (0.35%) లాభపడి 77,928.15 వద్ద స్థిరపడగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 66.95 పాయింట్లు (0.28%) పెరిగి 24,317.15 పాయింట్ల వద్ద ముగిసింది. లార్జ్-క్యాప్ సూచీలు మార్కెట్‌కు మద్దతుగా నిలిచినప్పటికీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.35 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.56 శాతం చొప్పున నష్టపోయాయి.

Sensex Today Nifty 50 Closing Bell Stock Market Today Sensex Closing Nifty Closing Indian Stock Market Share Market News Auto Stocks Oil and Gas Stocks BSE Sensex NSE Nifty Market Closing Stock Market Update Business News 50 amp amp

నిఫ్టీ 50 సూచీలో మహీంద్రా & మహీంద్రా (M&M), కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్ షేర్లు టాప్ గైనర్లుగా నిలిచి ప్రధాన సూచీలను ఆదుకున్నాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు అత్యుత్తమంగా రాణించాయి. మరోవైపు నిఫ్టీ రియల్టీ సూచీ అత్యధికంగా దాదాపు 2 శాతం పడిపోగా.. కెమికల్ రంగానికి చెందిన షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Also Read

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ప్రకారం.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణంపై వహించిన కఠిన వైఖరి వల్ల అమెరికా బాండ్ల రాబడులు పెరిగి మళ్లీ రేట్ల పెంపు భయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా పశ్చిమ ఆసియాలో యుద్ద భయాలతో ముడి చమురు ధరలలో వచ్చే వ్యత్యాసాలు ప్రపంచ మార్కెట్లను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) కొనుగోళ్లు, బలపడుతున్న రూపాయి, బలమైన మొదటి త్రైమాసిక (Q1FY27) ఫలితాలు దేశీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టాయని ఆయన అన్నారు.

సాంకేతిక విశ్లేషణను వివరించిన రిలిగేర్ బ్రోకింగ్ నిపుణుడు అజిత్ మిశ్రా మాట్లాడుతూ.. నిఫ్టీ ప్రస్తుతం 24,400 వద్ద (200-రోజుల EMA) బలమైన రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోందని తెలిపారు. మార్కెట్‌కు 24,100-24,000 స్థాయిల వద్ద బలమైన సపోర్ట్ ఉందని, ఈ స్థాయిల పైన నిలదొక్కుకుంటే నిఫ్టీ త్వరలోనే 24,600-24,800 స్థాయిల వైపు కదిలే అవకాశం ఉందని విశ్లేషించారు. ప్రస్తుత తరుణంలో రిస్క్ మేనేజ్‌మెంట్‌ను పాటిస్తూ, బలమైన పునాదులున్న స్టాక్స్‌లో "ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయడం శ్రేయస్కరమని ఆయన పెట్టుబడిదారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+