రెండు రోజుల పతనం తర్వాత ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కోలుకోవడానికి ప్రధాన కారణాలివే..

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండు రోజుల పాటు కొనసాగిన భారీ అమ్మకాల ఒత్తిడికి బుధవారం బ్రేక్ పడింది. బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతూ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 72,650 స్థాయి వద్ద, నిఫ్టీ 22,700 స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మీడియా, ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు మరియు ఐటీ రంగాల షేర్లలో వ్యూహాత్మక కొనుగోళ్లు నమోదవుతుండటం మార్కెట్‌కు ఊతమిస్తోంది.

అంతకుముందు మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోయి 72,529 వద్ద ముగియగా, నిఫ్టీ 64 పాయింట్లు క్షీణించి 22,716 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే, నేటి ట్రేడింగ్‌లో పతనం ఆగిపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటిది ఏంటంటే ఇటీవలి పతనం కారణంగా పడిపోయిన షేర్ల ధరలను ఆసరాగా చేసుకుని పెట్టుబడిదారులు తక్కువ ధరకు కొనుగోళ్లు జరపడం. మార్కెట్ ఓవర్‌సోల్డ్ జోన్‌లోకి వెళ్లడంతో సహజంగానే ఇలాంటి రికవరీ పునరుద్ధరణ చోటుచేసుకుంది.

Stock Market Today Stock Market LIVE Stock Market Live Updates Sensex Today Nifty Today Nifty 50 Sensex Nifty Above 22700 Sensex Up 180 Points IT Stocks Media Stocks Pharma Stocks TCS Share Indian Stock Market Share Market Today Stock Market News Nifty 50 Today Sensex Nifty Live Market Recovery IT Shares Stock Market Today Stock Market LIVE Stock Market Live Updates Sensex Today Nifty Today Nifty 50 Sensex

ఇక రెండవది ఏంటంటే.. మార్కెట్‌లో భయాందోళనలు గణనీయంగా తగ్గడం. ఆందోళనను సూచించే ఇండియా విక్స్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పడిపోయి 13.17 స్థాయికి చేరడం మార్కెట్‌లో అస్థిరత తగ్గుతోందనే సంకేతాన్ని ఇచ్చింది.

మూడవ ముఖ్య కారణం.. సూచీలకు కీలక స్థాయిల వద్ద లభించిన బలమైన మద్దతు. విశ్లేషకుల అంచనాల ప్రకారం నిఫ్టీకి 22,600 వద్ద గట్టి సపోర్ట్ లభించింది, ఈ స్థాయి పైన నిఫ్టీ కొనసాగితే తిరిగి 22,850 నుండి 23,000 స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవైపు మార్కెట్ కోలుకుంటున్నప్పటికీ ఫార్మా మరియు హెల్త్‌కేర్ రంగాలు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ ఫార్మా సూచీ 0.9 శాతం నష్టపోగా, హెల్త్‌కేర్ సూచీ 1.7 శాతం మేర క్షీణించింది.

Also Read

మరోవైపు నిఫ్టీ 50 లో విప్రో స్థానాన్ని భర్తీ చేసిన బీఎస్ఈ షేర్లు దాదాపు 3 శాతం పడిపోగా, విప్రో షేరు మాత్రం 2.5 శాతం మేర లాభపడింది. అయినప్పటికీ, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు అమ్మకాలను కొనసాగిస్తుండటం మార్కెట్‌ వర్గాల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి ప్రస్తుత ఈ సానుకూల పరిణామాన్ని స్థిరమైన రికవరీగా భావించడం తొందరపాటే అవుతుందని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం స్టాక్ మార్కెట్ తెరుచుకున్న వెంటనే హాస్పిటాలిటీ రంగ షేర్లు భారీగా పడిపోయాయి. మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలోనే షేర్లు దాదాపు 7% మేర పడిపోయాయి. భీమా రంగానికి సంబంధించి ఇటీవల వచ్చిన కఠినమైన ప్రతిపాదనల నేపథ్యంలో.. ఆసుపత్రి రంగానికి సంబంధించి కూడా అలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. ప్రాణాలను కాపాడే అనేక మందులపై ధరల పరిమితులు విధించవచ్చని మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి.

దీనికి తోడు ఇటీవల, మహారాష్ట్ర ఎఫ్‌డిఎ అధిక ఆసుపత్రి బిల్లుల సమస్యను లేవనెత్తగా.. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని సమీక్షించింది. ఆసుపత్రి గది అద్దెలు, సరఫరాలు, ఔషధాల ధరలపై పరిమితులు ఆసుపత్రి ఆదాయాలపై ప్రభావం చూపుతాయని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. దీంతో ఈ రంగంలోని షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+